టీడీపీ నేతల నామినేషన్ల జోరు!
అదేవిధంగా నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ వేశారు. స్థానికంగా పూజలు చేసి.. ఆయన నామినేషన్ సమర్పించడం గమనార్హం.
ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఈ నెల 25వ తేదీ వరకు అంటే.. మరో నాలుగు రోజుల వరకు మాత్రమే అవకాశం ఉంది. దీంతో అభ్యర్థులు నామినేష న్లు వేసేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. మరీ ముఖ్యంగా టీడీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా నామినేషన్ల ఘట్టంలో పాల్గొనడం గమనార్హం. నిన్న మొన్నటి వరకు కూడా.. అభ్యర్థులను ఖరారు చేసినా.. మార్పులు చేస్తున్న నేపథ్యంలో వారు.. తర్జన భర్జన పడ్డారు.
కానీ, ఆదివారం దాదాపు 140 స్థానాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు బీఫారాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో నాయకుల మధ్య ఉన్న సందేహాలు తొలగిపోయాయి. దీంతో సోమవారం.. ఉదయం నుంచి నామినేషన్ పత్రాలు పట్టుకుని ఆర్వో కేంద్రాలకు పోటెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కీలక నేతలు నామినేషన్లు వేశారు.
గుంటూరు జిల్లా గురజాల అభ్యర్థిగా యరపతినేని శ్రీనివాసరావు, అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన నేత మండలి బుద్ద ప్రసాద్, దెందులూరు నుంచిచింతమనేని ప్రభాకర్ వంటి సీనియర్లు నామినేషన్లు దాఖలు చేశారు.
అదేవిధంగా నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ వేశారు. స్థానికంగా పూజలు చేసి.. ఆయన నామినేషన్ సమర్పించడం గమనార్హం.
నందిగామలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిని తంగిరాల సౌమ్య భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. మరోవైపు వైసీపీ నాయకులు తొలి రెండు రోజులు నామినేషన్లు వేసిన విషయం తెలిసిందే.