టీడీపీ తొలి జాబితా ఇదే...బాబా మజాకానా...!

వైసీపీ కంటే రేసులో ముందు ఉండడం ద్వారా పొలిటికల్ గా భారీ అడ్వాంటేజ్ పొందాలని బాబు మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు.

Update: 2023-08-18 02:45 GMT

చంద్రబాబా మజాకానా అని టీడీపీ తమ్ముళ్ళే ఆశ్చర్యపోతున్నారు. చంద్రబాబు అంటే ఎపుడూ నోటిఫికేషన్ వచ్చిన తరువాత అభ్యర్ధుల కసరత్తు మొదలెట్టి నామినేషన్ కి గడువు చివరి గంటలో ఉందనగా క్యాండిడేట్స్ ని డిక్లేర్ చేస్తారు. అలాంటి బాబులో అనూహ్యమైన మార్పు కనిపిస్తోంది. ఎన్నడూ లేని విధంగా ఏడెమినిది నెలల ముందుగానే అభ్యర్ధులను ఖరారు చేస్తున్నారు.

ప్రచారంలో ఉన్న దాని ప్రకారం చూస్తే తెలుగుదేశం పార్టీ ఫస్ట్ లిస్ట్ రెడీ అయింది అని అంటున్నారు. అనేక రకాలైన సర్వేలు వడపోతల తరువాతనే చంద్రబాబు ఈ లిస్ట్ ప్రిపేర్ చేశారని అంటున్నారు. ఈ జాబితాలో డెబ్బై నుంచి ఎనభై మంది ఉంటారు అని ఆ మధ్య దాకా ప్రచారం సాగింది. కానీ దాన్ని కుదించి యాభై మందితో లిస్ట్ తొందరలోనే రిలీజ్ చేయనున్నారు అని అంటున్నారు.

ఏపీలో అన్ని పార్టీల కంటే ముందే జాబితా రిలీజ్ చేయడం ద్వారా ముఖ్యంగా వైసీపీ కంటే రేసులో ముందు ఉండడం ద్వారా పొలిటికల్ గా భారీ అడ్వాంటేజ్ పొందాలని బాబు మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. అన్ని రకాలుగా సమర్ధులను ఎంపిక చేసి ఫస్ట్ జాబితాను సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు.

ఈ జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు 19 మంది కచ్చితంగా ఉంటారట. అంటే వారికి చంద్రబాబు అప్పట్లో ఇచ్చిన హామీ మేరకు మళ్లీ టికెట్లు దక్కుతాయని అంటున్నారు. ఇది కూడా బాబు నుంచి వచ్చిన అనూహ్య నిర్ణయమే అని అంటున్నారు. ఇక వీరితో పాటు కచ్చితంగా గెలిచి తీరుతారు. ఎలాంటి వివాదాలు అక్కడ లేవు, వర్గ పోరు లేదు, అన్ని విధాలుగా బలవంతులు అని తేల్చుకున్న మీదట ఎంపిక చేసిన మరో 31 మందిని కూడా కలుపుకుని చంద్రబాబు అర్ధ సెంచరీ లిస్ట్ ని రెడీ చేశారు అని అంటున్నారు.

దసరాకు టీడీపీ తొలి జాబితా విడుదల అని ప్రచారంలో ఉంది. అయితే అప్పటికి రిలీజ్ చేస్తారా లేక శ్రావణ మాసం మంచి ముహూర్తం చూసి ఇపుడే లిస్ట్ ని బయటకు వదులుతారా అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా ఎన్నికలకు చాలా ముందుగా అభ్యర్ధులను రెడీ చేసి జనంలో ఉంచడం తెలుగుదేశం హిస్టరీలో ఎపుడూ జరగలేదు దాంతో బాబు ఈసారి ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అర్ధం చేసుకోవాలని అంటున్నారు.

మొత్తం మీద చూసుకుంటే మాత్రం తెలుగుదేశం ఫస్ట్ లిస్ట్ కనుక రిలీజ్ అయితే ఏపీలో అసలైన ఎన్నికల వేడి స్టార్ట్ అయిపోయినట్లే అని అంటున్నారు. ఆ మీదట అధికార పార్టీ నుంచి కూడా లిస్ట్ వచ్చినా రావచ్చు అంటున్నారు. మొత్తం మీద ఈ ఏడాది ఎండింగ్ కి అధికార వైసీపీ విపక్ష తెలుగుదేశం పార్టీల పూర్తి లిస్ట్ వచ్చినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. అలాగే రెండు పార్టీల స్పీడ్ అయితే ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News