మూడో వంతు సీట్లు...పవన్ డిమాండ్ కి టీడీపీ ఓకేనా...!?

ఆ మాటను ఇప్పటిదాకా జనసేన శ్రేయోభిలాషి, కాపు సంక్షేమ సేన నేత అయిన మాజీ మంత్రి చేగొండి హరి రామజోగయ్య అంటూ వచ్చారు.

Update: 2024-01-27 02:45 GMT

మూడవ వంతు సీట్లు ఏపీలో అంటే కచ్చితంగా 60 సీట్లు అన్న మాట. మొత్తం ఏపీలో 175 సీట్లు ఉన్నాయి. ఇందులో మూడవ వంతు తమకు పొత్తులో భాగంగా ఇవ్వాలన్నది జనసేన అభిమతం. ఆ మాటను ఇప్పటిదాకా జనసేన శ్రేయోభిలాషి, కాపు సంక్షేమ సేన నేత అయిన మాజీ మంత్రి చేగొండి హరి రామజోగయ్య అంటూ వచ్చారు. ఆయన ఇటీవల మంగళగిరి వెళ్ళి మరీ పవన్ తో భేటీ అయ్యారు. మొత్తం జనసేనకు బలం ఉన్న సీట్ల వివరాలను ఆయన ఆయనకు అందించారు.

పొత్తులో భాగంగా వాటిని కోరాలని జోగయ్య సూచించినట్లుగా వార్తలు వచ్చాయి. మరో వైపు చూస్తే సోషల్ మీడియాలో ఒక లిస్ట్ ని కూడా విడుదలా చేశారు. అందుకో కూడా దాదాపుగా డెబ్బై సీట్ల దాకా జనసేన పోటీ చేయబోయేవి ఉన్నాయి. వాటికి సంబంధించి అభ్యర్ధులను కూడా పక్కన పేర్కొన్నారు. ఇదంతా గత కొంతకాలంగా కొనసాగుతోంది.

మరో వైపు చూస్తే సీట్ల సర్దుబాటు అన్న అతి పెద్ద అంశాన్ని పక్కన పెట్టి చంద్రబాబు జిల్లా టూర్లు చేస్తున్నారు. ఆయన తన టూర్లలో దాదాపుగా చాలా మందికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు అని అంటున్నారు. అఫీషియల్ గా అయితే మాత్రం అరకు మండపేట సీట్లకు ప్రకటించారు. దాంతో ఆ రెండు సీట్ల విషయమే మాట్లాడుతూ పవన్ రిపబ్లిక్ డే వేళ తాను కూడా రెండు సీట్లను ప్రకటిస్తాను అని అని రాజోలు, రాజానగరం సీట్లను ప్రకటించారు.

ఇందులో రాజోలు విషయంలో ఇబ్బంది లేకపోయినా రాజానగరం విషయంలో తమ్ముళ్ళు ఆశతో ఉన్నారు. మరి ఆ సీటు నుంచి జనసేన పోటీ చేస్తుంది అని పవర్న్ ప్రకటించడంతో సహజంగానే టీడీపీలో ఆందోళన ఉంటుంది. ఇంకో వైషయం చూస్తే జనసేన పొత్తులో కోరే సీట్లు ఎక్కువగా ఉత్తరాంధ్రా ఉభయ గోదావరి జిల్లాల నుంచే కావడం విశేషం.

మొత్తం కోస్తా జిల్లాలలో 101 అసెంబ్లీ సీట్లు ఉనంటే ఇందులో 68 సీట్ల్లు ఉత్తరాంధ్రా ఉభయ గోదావరి జిల్లాలలో ఉన్నయి. వీటిలో అనేకం టీడీపీకి కంచుకోటలు ఉన్నాయి. ఇపుడు వాటి మీద గురి పెట్టి జనసేన పొత్తులో తమకు ఇవ్వమని కోరుతోంది. ఉదాహరణకు పెద్దాపురం, పిఠాపురం, రాజమండ్రి రూరల్, తాడేపల్లిగూడేం వంటివి అని చెప్పాలి. అలాగే ఉత్తరాంధ్రాలో పెందుర్తి, భీమునిపట్నం, గాజువాక, అనకాపల్లి ఎలమంచిలి వంటి సీట్లలో టీడీపీకి గట్టి పట్టు ఉంది

అలాగే విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల, విజయంగరం గజపతినగరం సీట్లు శ్రీకాకుళంలో శ్రీకాకుళం, ఇచ్చాపురం, పలాసా, ఎచ్చెర్ల వంటి వాటి మీద జనసేన పొత్తులో సీట్లను అడుగుతోందని అంటున్నారు. దీంతో ఈ సీట్లు టీడీపీ అసలు ఇచ్చేందుకు వీలు లేదని అంటున్నారు.

మొత్తం ఈ అరవై ఎనిమిది సీట్లలో తమకు కనీసంగా ముప్పై దాకా సీట్లను ఇవ్వాలన్నది జనసేన పట్టుగా కనిపిస్తోంది అని అంటున్నారు. అన్ని సీట్లు కనుక జనసేనకు ఇచ్చేస్తే టీడీపీ లీడర్ షిప్ లోనే పెద్ద ఎత్తున అలజడి వస్తుంది అని అంటున్నారు. అంతే కాదు సీనియర్ మోస్ట్ లీడర్స్ అంతా కూడా తిరుగుబాటు బావుటా ఎగరేస్తారు అని అంటున్నారు.

మరో వైపు సీట్లు ఇచ్చినా తమ్ముళ్ల నుంచి సహాయ నిరాకరణ ఎదురైతే ఈ సీట్లూ పోతాయన్న కంగారు టీడీపీ పెద్దలలో ఉంది అని అంటున్నారు. టీడీపీ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే కనీసంగా ఇరవై నుంచి మొదలెట్టి పాతిక దాకా జనసేనకు సీట్లు ఇవ్వాలని అంటున్నారు. అందులో కూడా గోదావరి, ఉత్తరాంధ్రా జిల్లాలలో పది నుంచి పదిహేను ఇచ్చి మిగిలినవి ఏపీలో మిగిలిన జిల్లాలలో సర్దుబాటు చేయాలని అంటున్నారు.

అయితే దీనికి జనసేన ఒప్పుకోదు అనే అంటున్నారు. చిత్రమేంటి అంటే టీడీపీకి కంచుకోటలలోనే జనసేనకూ బలం ఉంది. రెండు పార్టీలకూ రాయలసీమలో పట్టు తక్కువగా ఉంది. దాంతో రాయలసీమ కంటే తమకు ఈ జిల్లాలలోనే ఎక్కువ సీట్లు కావాలని జనసేన కోరుతోంది అని అంటున్నారు. అందులో కూడా గెలిచే సీట్లు అన్న కండిషన్ జనసేన నుంచి వస్తోంది. అందుకే సీట్ల సర్దుబాటు కొలిక్కి రావడం లేదు అని అంటున్నారు. మొత్తం మీద ఎన్ని చెప్పుకున్నా జనసేనకు మూడవ వంతు సీట్లు టీడీపీ ఇవ్వడం అసలు జరగని పని అంటున్నారు. మరి అపుడు జనసేన ఏమి చేస్తుంది అన్నదే ఇక్కడ చర్చగా ఉంది అంటున్నారు.


Tags:    

Similar News