టీడీపీలో ముప్పయి కోట్లు ఉన్న అభ్యర్ధులు కేవలం అయిదుగురేనా...!?

అంగబలం అర్ధబలం సమకూర్చుకునే విషయంలో అధికార వైసీపీ కంటే వెనకబడుతోందా అంటే అవును అనే అంటున్నారు.

Update: 2024-02-12 10:15 GMT

తెలుగుదేశం పార్టీ నాలుగు దశాబ్దాలు దాటిన పార్టీ. అయితే ఆ పార్టీ ఇపుడు అన్ని విధాలుగా ఇబ్బంది పడుతోందా. అంగబలం అర్ధబలం సమకూర్చుకునే విషయంలో అధికార వైసీపీ కంటే వెనకబడుతోందా అంటే అవును అనే అంటున్నారు. ఇదిలా ఉంటే ప్రచారంలో ఉన్న దాని ప్రకారం చూస్తే టీడీపీలో అపర కుబేరులు బాగా తగ్గిపోయారు అని అంటున్నారు.

ఎంతలా అంటే ఈసారి ఎన్నికల్లో ధన ప్రవాహం వెల్లువలా సాగుతుంది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ప్రతీ అసెంబ్లీ సీటు విషయంలో గట్టిగా ఖర్చు చేయడానికి సత్తా లేని వారు ఎక్కువ మందే ఉన్నారు అని అంటున్నారు. ఈ పరిణామాల నేపధ్యంలో టీడీపీకి ఆర్ధికంగా బలంగా ఉన్న వారి కరవు పట్టి పీడిస్తోంది అని అంటున్నారు.

ఏపీలో పొత్తుల పంచాయతీ ఒక కొలిక్కి వస్తున్న వేళ బీజేపీ ప్లస్ జనసేనలకు నలభై దాకా అసెంబ్లీ సీటు టీడీపీ కేటాయిస్తోంది. ఇక మిగిలిన 135 సీట్లలో సోలోగా టీడీపీ పోటీ చేయాల్సి ఉంది. ఈ సీట్లలో సంగతేంటి అన్నది చూస్తే కనుక కనీసంగా నియోజకవర్గానికి ముప్పయి కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంది అని అంటున్నారు.

మరి టోటల్ గా చూస్తే 135 మంది అభ్యర్ధులలో కేవలం అయిదుగురు అభ్యర్ధులు మాత్రమే ముప్పయి కోట్ల రూపాయల దాకా ఖర్చు చేసే అర్ధిక స్తోమత కలిగి ఉన్నారని అంటున్నారు. అదే అధికార వైసీపీ తీసుకుంటే రాష్ట్రం అంతా ఆర్ధికంగా బలవంతులు ఆ పార్టీకి ఉన్నారు. పైగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో వైసీపీ పోటీ చేస్తోంది.

ఏపీలో ఇపుడున్న పరిస్థితులు రాజకీయాలు చూస్తే కనుక ఓటుకు రెండు వేలు పెట్టాల్సి వస్తుంది అని అంటున్నారు. అలా వైసీపీలో స్ట్రాంగ్ పర్సన్స్ చాలా మంది ఉన్నారు అని అంటున్నారు. వైసీపీ స్టేట్ అంతా ఈ విధంగా చేసే పరిస్థితి ఉందని గ్రామాలలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

ఒక అంచనాగా చూసుకుంటే ప్రతీ నియోజకవర్గంలో లక్షన్నర మందికి ఒక్కొక్కరికి రెండు వేలు వంతున అంటే ముప్పయి కోట్ల రూపాయలు అవుతుంది అని అంటున్నారు. దీంతో పాటు బూత్ మేనేజ్మెంట్ అలాగే ప్రీ పోల్ ఖర్చులు అన్నీ కలిపి మరో పది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని లెక్క వేస్తున్నారు. ఇల్లా మొత్తం కలిపి లెక్క వేస్తే నలభై కోట్ల రూపాయలు ఈసారి ఒక్కో ఎమ్మెల్యే నియోజకవర్గంలో అవుతుంది అని అంటున్నారు.

వైసీపీ విషయానికి వస్తే అభ్యర్ధి గన ఖర్చుగా ముప్పయి కోట్లు పెట్టుకుంటే పార్టీ ఫండ్ గా మరో ఇరవై కోట్ల రూపాయలు ఇస్తుంది అని అంటున్నారు. ఇటీవల పార్టీలో పెద్ద ఎత్తున దీని మీద చర్చ జరిగినట్లుగా చెబుతున్నారు. దీనిని బట్టి చూస్తే వైసీపీ అభ్యర్ధి ఏకంగా యాభై కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టే పరిస్థితి ఉందని తేలుతున్న విషయంగా ఉంది.

ఇక టీడీపీ విషయానికి వస్తే ఆ పార్టీ గెలవాలని కోరుకుంటూ పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్న ఆయా సామాజిక వర్గానికి చెందిన వారు అంతా పెద్ద ఎత్తున డొనేషన్స్ ఇస్తున్నారు అని అంటున్నారు. అలా టీడీపీకి ఆర్ధికంగా అండ అయితే ఉంది అని అంటున్నారు.

ఇక హైదరాబాద్ లో ఉండే ఒక ఫార్మా కంపెనీ అయితే ఏకంగా నలభై కోట్ల రూపాయలు టీడీపీకి ఇస్తున్నట్లుగా ప్రచారంలో ఉంది. అలాగే టీడీపీకి ఆర్ధికంగా సాయం చేసేందుకు ముందుకు వచ్చారు అని అంటున్నారు. ఇక గత కొన్నాళ్ళుగా లోకేష్ హైదరాబాద్ లోనే ఉన్నారు ఆయన పార్టీ ఫండింగ్ విషయం మీదనే సీరియస్ గా అన్ని విషయాలు చూసారని అంటున్నారు.

ఆయన తన ఇంటిదగ్గరే ఉండి టీడీపీకి వచ్చే ఎన్నికల్లో అవసరం అయిన నిధులు ఫైనాన్షియల్ మేంజేమెంట్ వంటివి కొంతమంది పెద్దలతో డిస్కషన్ చేసినట్లుగా చెబుతున్నారు. ఏది ఏమైనా అయిదేళ్ల పాటు టీడీపీ అధికారంలో లేదు. అదే టైం లో వైసీపీ పూర్తిగా టీడీపీ ఆర్హిక మూలాలను దెబ్బ తీసిందని అంటున్నారు.

దాంతో చాలా మంది వ్యాపారాలు డిస్టర్బ్ అయ్యాయని అంటున్నారు. ఈ నేపధ్యంలో ఇపుడు టీడీపీ పూర్తిగా ఎన్నారైల మీద ఆధారపడింది అని అంటున్నారు. అలాగ పొరుగు రాష్ట్రం మీద కూడా ఆధారపడింది అని అంటున్నారు. ఆ నిధులు అన్నీ మనీ ఫ్లో జరగాలంటే కేంద్రంలోని బీజేపీ హెల్ప్ అవసరం అందుకే ఈ పొత్తులు ఎత్తులు అని అంటున్నారు.


Tags:    

Similar News