అమెరికాలో హ్యూమన్ ట్రాఫికింగ్... టీడీపీవి గురివింద కబుర్లంటున్న వైసీపీ!

దీంతో... ఆ వ్యక్తి వైసీపీకి చెందిన నాయకుడు అంటూ టీడీపీ సోషల్ మీడియాలో ఫుంకాను ఫుంకాలుగా కథనాలు రాసేస్తున్నారు.

Update: 2023-12-01 11:32 GMT

ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ విషయాన్ని టీడీపీకి చెందిన సోషల్ మీడియా టీం ట్రెండింగ్ చేసే పనిలో ఉందని తెలుస్తుంది. దీంతో ప్రపంచంలో ఏ బ్యాడ్ జరిగినా.. ఎక్కడ తప్పుడు పనులు తెరపైకి వచ్చినా.. అది వైసీపీకి అంటగట్టే ప్రయనాలు చేయడమే టీడీపీ పనిగా మారిందని.. గురువింద గింజ సామెతకు పూర్తి న్యాయం చేస్తుంటుందని కామెంట్లు చేస్తున్నారు వైసీపీ నెటిజన్లు!

అవును... సత్తారు వెంకటేష్ రెడ్డి అనే వ్యక్తి అమెరికాలో అరెస్టయ్యాడు! ఒక యువకుడిని వేధించిన కారణంగా.. అతడితో పాటు మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో... ఆ వ్యక్తి వైసీపీకి చెందిన నాయకుడు అంటూ టీడీపీ సోషల్ మీడియాలో ఫుంకాను ఫుంకాలుగా కథనాలు రాసేస్తున్నారు. దీంతో ఈ విషయంపై వైసీపీ స్పందించింది.

ఇందులో భాగంగా... "అమెరికాలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్నారై సత్తారు వెంకటేష్ రెడ్డికి, పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. ఈ ఘటనను వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ కేసులో ఉన్న సత్తారు వెంకటేష్ రెడ్డి చేసిన నేరం అతని వ్యక్తిగతం. చట్టం తన పని తాను చేసుకుపోతుంది" అని ఆన్ లైన్ వేదికగా వెల్లడించింది.

ఈ సమయంలో గతంలో విదేశాలో దౌర్భాగ్యకరమైన పనులు చేసిన టీడీపీ కి చెందిన వ్యక్తుల జాబితా నెట్టింట వైరల్ గా మారుతుంది. ఇదే సమయంలో గురువింద గింజ సామెతను గుర్తుచేస్తున్నారు నెటిజన్లు. ఇందులో భాగంగా... పచ్చపార్టీ నీతులు చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని అంటున్నారు.

సత్తారు వెంకటేష్ రెడ్డి ని వెనకేసుకు రావాల్సిన అవసరం వైసీపీకి లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. తప్పు ఎవరు చేసిన తప్పే..! అయితే అమెరికాలో వుమెన్ ట్రాఫికింగ్ ఘటనలో టీడీపీ... దాన్ని వైసీపీకి అంటగట్టి పెద్ద రాద్దాంతం చేస్తోంది. దీంతో గతం గుర్తు చేస్తూ వైరల్ చేస్తున్నారు నెటిజన్లు.

ఇందులో భాగంగా... గతంలో అమెరికాలో టీడీపీ తరుపున ఉన్న వ్యక్తులు ఇలాంటి ఘటనలకు పాల్పడ్డారని అంటున్నారు. ఈ క్రమంలో... మోదుగుముడి కిషన్ చౌదరి, మోదుగుముడి చంద్రకళ పూర్ణిమ, యార్లగడ్డ రాం చౌదరి.. సెక్స్ వర్కర్ తో కలిసి హోటల్ లో అడ్డంగా బుక్కయిన వినిత్ రావూరి, వీళ్ళంతా టీడీపీకి చెందినవారు కాదా అని ప్రశ్నిస్తున్నారు.

అప్పట్లో వారిపై ఆరోపణలు వచ్చినపుడు టీడీపీ అధినేత చంద్రబాబు కానీ.. ఆ పార్టీ నేతలుకానీ కనీసం ఈ విషయాన్ని ఖండించలేదు. వారిపై ఏలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం పార్టీ నుండి కూడా తొలగించలేకపోయింది టీడీపీ. అలాంటి వ్యక్తులు ఇప్పుడు వైసీపీపై బురద జల్లడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

కాగా... గతంలో టాలీవుడ్ సినీతారలతో వ్యభిచారం చేయిస్తూ అమెరికా పోలీసులకు పట్టుబడ్డ టీడీపీ ఎన్నారై సభ్యుడు కిషన్ మోదుగుమూడి, అతని భార్య చంద్రకళా పూర్ణిమా మోదుగుమూడి అంటూ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో చంద్రబాబు అత్యంత సన్నిహితుడిగా పేరుందని చెప్పే చేకూరి కోటేశ్వర రావు స్టాకింగ్ చేస్తూ అరెస్టైన సంగతీ తెలిసిందే!

Tags:    

Similar News