జూనియర్ ఎన్టీయార్ ఉద్యమం టీడీపీలో స్టార్ట్ అయిందా...?

టీడీపీలో ఇపుడు కొత్త ఉద్యమం స్టార్ట్ అయింది అంటున్నారు. అదే జూనియర్ ఎన్టీయార్ ఉద్యమం అని అంటున్నారు

Update: 2023-09-22 08:07 GMT

టీడీపీలో ఇపుడు కొత్త ఉద్యమం స్టార్ట్ అయింది అంటున్నారు. అదే జూనియర్ ఎన్టీయార్ ఉద్యమం అని అంటున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది అసలు జూనియర్ ఎన్టీయార్ కి రాజకీయాలకు సంబంధం లేదు కదా మరి ఈ ఉద్యమం సంగతేంటి అన్న డౌట్ అయితే రావచ్చు కానీ జూనియర్ ని ఈ కీలక టైం లో ఎందుకు తలచుకుంటున్నారు దాని వల్ల ఏమిటి జరుగుతుంది అన్నది కూడా చర్చకు వస్తోంది.

వాస్తవంగా చూస్తే సీనియర్ ఎన్టీయార్ స్థాపించినది తెలుగుదేశం పార్టీ. ఆయన నందమూరి వారి మూలపురుషుడు. ఆయన గ్లామర్ తో పాటు ప్రజా సేవతో తపన పడి రాజకీయాల్లోకి వచ్చి తన సత్తా చాటారు. ఇక చంద్రబాబు చేతిలోకి వచ్చాక టీడీపీకి గ్లామర్ అయితే లేదు, కానీ బాబు గ్రామర్ తో పార్టీని నడుపుకుంటూ వచ్చారు.

అయితే చంద్రబాబు జైలు పాలు అయ్యారు. పార్టీకి సరైన దిశా నిర్దేశం చేసే పరిస్థితి లేదు ఈ నేపధ్యంలో అందరి నోట అంటే టీడీపీ కోసం తపన పడే వారి నోట జూనియర్ ఎన్టీయార్ పేరు వస్తోంది అని అంటున్నారు. జూనియర్ ఈ సమయంలో వస్తేనే పార్టీ నిలబడుతుంది అని టీడీపీలో యువ నేతల మధ్య సీరియస్ గా డిస్కషన్ అవుతోంది అని అంటున్నారు.

ఇప్పటికే చంద్రబాబుని అరెస్ట్ చేశారు. ఒకవేళ లోకేష్ ని కూడా అరెస్ట్ చేస్తే కనుక ఆయన బయటకు వచ్చే అవకాశాలు అయితే లేవు అని అంటున్నారుట. అదే విధంగా చంద్రబాబు విషయం తీసుకుంటే ఒక కేసు తరువాత మరో కేసు బనాయించి ఆయనను జైలు లోపల ఉండేలా చేస్తున్నారు టీడీపీ యువ నేతలు చర్చించుకుంటున్నారు.

ఇక ఈ సమయంలో బ్రాహ్మణికి పగ్గాలు అప్పగించినా ఆమెను అంతగా బయటకు రానీయరు అని కూడా ఆలోచిస్తున్నారుట. బ్రాహ్మణికి పగ్గాలు ఇచ్చినా ఆమె సర్దుకుని చేసేసరికి పుణ్యకాలం దాటిపోతుంది అన్నది కూడా మరో చర్చగా ఉంది. ఈ నేపధ్యంలో చంద్రబాబు ఆయన రాజకీయ వారసత్వం కంటే ఈ సంక్లిష్ట సమయంలో టీడీపీని కాపాడుకోవడమే ముఖ్యమని ఆ పార్టీలో అసలైన కార్యకర్తలు యువ నేతలు తీవ్రంగానే చర్చిస్తున్నారుట.

ఇక వారూ వీరూ ఎందుకు టీడీపీకి పటిష్టమైన నాయకత్వం కావాలీ అంటే జూనియర్ ఎన్టీఆర్ ని మించిన వారు లేరు అని అంటున్నారు. జూనియర్ ఎన్టీయార్ కనుక బాధ్యతలు స్వీకరిస్తే మరో ముప్పయ్యేళ్ల పాటు టీడీపీకి ఎదురు ఉండదని కూడా ఆలోచిస్తున్నారు.

జూనియర్ వస్తేనే టీడీపీ బట్ట కడుతుందని గ్రామాలలో ఉన్న యువ టీడీపీ క్యాడర్ అయితే సీరియస్ గానే ఆలోచిస్గ్తోందిట. నిజంగా ఇది సరైన విశ్లేషణ అనే అంటున్నారు. నారా ఫ్యామిలీ అంటూ వారి చుట్టూ అల్లుకుని పార్టీని పూర్తిగా డ్యామేజ్ చేసుకోవడం కంటే నందమూరి వారి అసలైన బ్లడ్ అయిన జూనియర్ ఎన్టీఆర్ కే పార్టీ పగ్గాలు అప్పగిస్తే కచ్చితంగా టీడీపీ జెండా ఎగురుతుందనే అంతా అంటున్నారు.

పార్టీలో పెద్ద తలకాయలు సీనియర్ నేతలు అంతా చంద్రబాబుతో సాన్నిహిత్యం వల్ల అసలు నిజాలు కనిపించినా పక్కన పెట్టవచ్చు కానీ యువత మాత్రం పార్టీ కోసం తపించే వారు కానీ టీడీపీ జెండా ఎలా ఎగరాలో అన్నది ఆలోచిస్తున్నారు. వారు నిజమైన విశ్లేషణలు చేస్తూ జూనియర్ రావాల్సిందే అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే పాదయాత్ర చేసినా లోకేష్ ఇమేజ్ ఏమీ పెద్దగా పెరగలేదు, అదే టైం లో చంద్రబాబు వయసు పెద్ద ప్రశ్నగా ఉంది. దాంతో పక్క పార్టీ వారిని సాయం అడిగి టీడీపీని ఎంతకాలం నిలబెట్టుకుంటారు అన్నది కరడు కట్టిన కార్యకర్తలలో రగులుతున్న ఆవేదన. ఎన్టీయార్ ఒంటి చేత్తో పార్టీని మూడు సార్లు బంపర్ మెజారిటీతో గెలిపించారని గుర్తు చేస్తున్నారు.

మళ్లీ అలాంటి వైభోగం రావాలీ అంటే అది ఒక్క జూనియర్ వల్లనే సాధ్యపడుతుంది అని అంటున్నారు. జూనియర్ ఎన్టీయార్ ని పార్టీలో కీలకం చేసి బాధ్యతలు అప్పగిస్తే జోష్ ఫుల్ గా వస్తుందని, వైసీపీ వంటి బలమైన పార్టీని ఢీ కొట్టడానికి కూడా జూనియర్ కి మించిన లీడర్ ఉండరని అంటున్నారు. మరి జూనియర్ రావాలని టీడీపీలో చర్చ నుంచి ఒక ఉద్యమంగా మారుతోంది. దీనికి జూనియర్ వైపు నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి. దానికి మించి నారా వారి నీడలో ఉన్న టీడీపీలో అలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయా అన్నది కూడా ఆలోచించాల్సి ఉంది.

Tags:    

Similar News