టీడీపీలోనూ ఈ సిట్టింగ్‌కు సీట్లు గల్లంతేనా...
ప్రస్తుతం 151 మందిలో 11 మందిని మార్చేస్తున్నారన్న చర్చ దరిమిలా రాబోయే రోజుల్లో ఇంకెంతమంది ఔట్ అవుతారనేది.. ఆసక్తిగా ఉంది.
వైసీపీలో ఎంత మంది సిట్టింగులకు సీట్లు ఇస్తారు? ఎంతమందిని తిరిగి అసెంబ్లీకి పంపిస్తారు? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా ఉంది. ప్రస్తుతం 151 మందిలో 11 మందిని మార్చేస్తున్నారన్న చర్చ దరిమిలా రాబోయే రోజుల్లో ఇంకెంతమంది ఔట్ అవుతారనేది.. ఆసక్తిగా ఉంది. ఈ టెన్షన్ ఇలా ఉంటే.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో కూడా ఈ చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో నలుగురు(వాసుపల్లి గణేష్, కరణం బలరాం, మద్దాలి గిరిదర్, వల్లభనేని వంశీ) పార్టీ నుంచి బయటకు వచ్చారు. మిగిలిన వారు 19 మంది.. వీరిలో ఒకరు చంద్రబాబు, మరొకరు బాలయ్య. ఈ రెండు సీట్లు ఖాయమే. మిగిలిన 17 స్థానాల్లో ఎంత మందికి టికెట్లు ఇస్తారు? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం 12 నుంచి 15 మందికి సీట్లు కేటాయించనున్నట్టు తెలుస్తోంది.
అయితే.. మిగిలిన ఆ ఇద్దరినీ కూడా.. టికెట్లు కాదనే పరిస్థితి కనిపించడం లేదు. ఈ క్రమంలో ప్రత్యామ్నా యంగా మరో రూపంలో పదవులు ఇవ్వాలనేది పార్టీ నిర్ణయంగా ఉంది. వారిలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే భవానీ భర్త ఈ దఫా పోటీకి రెడీ అవుతున్నారు. ఇక, రూరల్ నియోకవర్గం ఎమ్మెల్యే బుచ్చయ్యను ఈ సారి మండలికి పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపై ఒక క్లారిటీ వచ్చాక.. ఈ సీటును జనసేనకు కేటాయించే అవకాశం ఉంది.
అంటే.. మొత్తంగా సిట్టింగుల్లో అందరికీ టికెట్లు దక్కే చాన్స్ ఉంది. ఇక, ఇదేసమయంలో ఈ సారి స్థాన చలనాలు కూడా ఎక్కువగానే ఉంటాయని చెబుతున్నారు. విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరా వును భీమిలి పంపించనున్నట్టు చర్చ సాగుతోంది. మరోవైపు.. ఉండి ఎమ్మెల్యేను వేరే స్తానానికి పంపిస్తారని, లేదా.. ఈ సారి ఆయనను పక్కన పెట్టినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. మొత్తానికి మార్పులు ఉన్నప్పటికీ. దాదాపు అందరికీ టికెట్లు దక్కడం ఖాయమనే వాదన వినిపిస్తోంది.