తీన్మార్ మల్లన్న సౌండ్ మామూలుగా లేదుగా?

రాష్ట్రంలో బీసీ బిడ్డలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయకపోతే భూకంపాన్ని క్రియేట్ చేస్తానని పేర్కొన్నారు.

Update: 2024-08-26 05:09 GMT

సంచలన వ్యాఖ్యలకు ఏ మాత్రం వెనుకాడకుండా.. సొంత పార్టీ మీదా.. సొంత నాయకత్వం మీదా.. సొంత ప్రభుత్వం మీదా విమర్శలు చేసే టాలెంట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు కాస్త ఎక్కువగానే ఉంటుంది. తాజాగా ఆయన అలాంటి వ్యాఖ్యలే చేశారు. రాష్ట్రంలో బీసీ బిడ్డలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయకపోతే భూకంపాన్ని క్రియేట్ చేస్తానని పేర్కొన్నారు.

రిజర్వేషన్లను అమలు చేయకపోతే ప్రజల్లో ఒక్కరు కూడా తిరగలేరన్న ఆయన.. ‘‘రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను అమలు చేసి తీరాల్సిందే. బీసీల సహకారంతోనే గెలిచా. నేను ఓడిపోతానని ఎద్దేవా చేసిన వారిని ఎన్నికల్లో గెలవనివ్వను. బీసీలను గెలిపించేందుకు మహా అయితే పదవి పోతుంది. మళ్లీ టీవీ ముందు కూర్చుంటా’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో బీసీ సర్కారు రాబోతుందన్న వ్యాఖ్యలు చేసిన ఆయన.. బిచ్చగాళ్లలా కుల సంఘాలకు రూ.50 కోట్లను ఏ లెక్కన కేటాయిస్తారని ప్రశ్నించిన మల్లన్న.. బడ్జెట్ లో బీసీలకు రూ.9వేలకోట్లు కేటాయిస్తే తాను నిర్భయంగా ప్రశ్నించానన్నారు. బీసీలను గెలిపించటమే తన లక్ష్యంగా చెప్పుకుంటున్న తీన్మార్ మల్లన్న తాజా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Tags:    

Similar News