తెలంగాణా ఎన్నికలకు డేట్ ఫిక్స్ ....?

తెలంగాణా ఎన్నికలు డిసెంబర్ మొదటి వారంలో జరగనున్నాయని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ముందస్తు కసరత్తుని కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధం చేస్తోంది.

Update: 2023-09-30 12:44 GMT

తెలంగాణా ఎన్నికలు డిసెంబర్ మొదటి వారంలో జరగనున్నాయని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ముందస్తు కసరత్తుని కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధం చేస్తోంది. అక్టోబర్ 3 వ తేదీ నుంచి మూడు రోజుల పాటు తెలంగాణాలో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ పర్యటించనున్నారు. తెలంగాణాలో పరిస్థితులను ఆయన మధింపు చేసుకుని ఢిల్లీకి వెళ్తారు.

ఆ మీదట అక్టోబర్ 10వ తేదీలోగా ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. దాంతో ఎన్నికల నగారా మోగినట్లే అంటున్నారు. 2018లో కూడా చూస్తే ఈ విధంగానే జరిగింది. అక్టోబర్ 6న ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయింది. డిసెంబర్ ఫస్ట్ వీక్ లో ఎన్నికలు జరిపారు. 12న ఫలితాలు వచ్చాయి. దాని కంటే ముందు సెప్టెంబర్ 6న కేసీయార్ అసెంబ్లీని రద్దు చేశారు. ఆనాడు కేంద్రంతో సఖ్యత దృష్ట్యా కేసీయార్ కోరుకున్న విధంగానే అంతా జరిగిందని అంటారు.

ఇపుడు చూస్తే కేంద్రంతో చెడింది అని ప్రచారంలో ఉన్న మాట. దాంతో బీజేపీ తనకు అనుకూలం చూసుకుంటోంది అని అంటున్నారు. తెలంగాణాలో ప్రధాని పర్యటన అక్టోబర్ 2, 3 తేదీలలో ఉంది. ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. అదే విధంగా రెండు మూడు బహిరంగ సభలలో ప్రసంగించనున్నారు. నోటిఫికేషన్ కి ముందు ప్రధాని నరేంద్ర మోడీ చేసే చివరి పర్యటనగా దీన్ని చూస్తున్నారు. ఆ తరువాత ఎన్నికల ప్రకటన ఉంటుదని అంటున్నారు.

ఇక చూస్తే తెలంగాణాలో మొత్తం 119 సీట్లకు గానూ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికి అయితే బీయారెస్ దాదాపుగా వంద దాకా అసెంబ్లీ సీట్లకు అభ్యర్ధులను ప్రకటించి అగ్ర స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ అభ్యర్ధుల ప్రకటనకు కసరత్తు సాగుతోంది. బీజేపీ కూడా ఈ విషయంలో కసరత్తు చేస్తోంది.

ఎన్నికల ప్రచారం విషయం చూస్తే అన్ని పార్టీలూ రెడీగానే ఉన్నాయని అంటున్నరు. ఇప్పటికే అంతా రంగంలోకి దిగిపోయాయని అంటున్నారు. తెలంగాణా ఓటర్ల తీర్పు అయితే ఏమిటన్నది ఎవరికీ తెలియదు. ఓటరు మౌనంగానే అంతా గమనిస్తున్నాడు. ఈవీఎం ల ద్వారానే తన తీర్పుని వెల్లడించనున్నాడు. ఇంకో వైపు చూస్తే హ్యాట్రిక్ విజయం తమదేనని బీయారెస్ అంటోంది.

ఈసారి తప్పకుండా అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ చెబుతోంది. బీజేపీ కూడా తామే అధికారంలోకి వస్తామని చెబుతోంది. అక్టోబర్ 10లోగా నోటిఫికేషన్ వస్తే కనుక గట్టిగా రెండు నెలలు కూడా సమయం ఉండదు.హోరా హోరీగా ఈసారి ఎన్నికలు జరగనున్నాయని అంటున్నారు.

Tags:    

Similar News