ఎగ్జిట్ పోల్స్ సర్వే: కాంగ్రెస్ దే తెలంగాణా...!

తెలంగాణాలో పదేళ్ల తరువాత అధికారం చేతులు మారబోతోందా అంటే అవును అని ఎగ్జిట్ పోల్స్ సర్వే నివేదికలు వెల్లడిస్తున్నాయి

Update: 2023-11-30 12:48 GMT

తెలంగాణాలో పదేళ్ల తరువాత అధికారం చేతులు మారబోతోందా అంటే అవును అని ఎగ్జిట్ పోల్స్ సర్వే నివేదికలు వెల్లడిస్తున్నాయి. గురువారం సాయంత్రం అయిదు గంటలతో పోలింగ్ ముగిసిన వెంటనే అయిదున్నర నుంచి వరసబెట్టి ఎగ్జిట్ పోల్స్ సర్వే నివేదికలు వచ్చేస్తున్నాయి.

తెలంగాణాలో కాంగ్రెస్ దే అధికారం అని దాదాపుగా అన్ని సర్వేలు చాటి చెప్పడం విశేషం. ముందుగా సీ-ప్యాక్ ఎగ్జిట్ పోల్స్ సర్వేను తీసుకుంటే కాంగ్రెస్ కి 65 స్థానాలు,బీఆర్ఎస్- 41 స్థానాలు, బీజేపీ- 4 స్థానాలు, ఇతరులు- 9 స్థానాలు వస్తాయని పేర్కొంది. ఆరా ఎగ్జిట్ పోల్ సర్వే చూస్తే కాంగ్రెస్- 58 నుంచి 67 స్థానాలు, బీఆర్ఎస్- 41 నుంచి 49 స్థానాలు, బీజేపీ- 5 నుంచి 7 స్థానాలు, ఇతరులు- 7 నుంచి 9 స్థానాలు వస్తాయని స్పష్టం చేసింది.

అదే విధంగా చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్స్ చూస్తే కాంగ్రెస్- 67 నుంచి 78 స్థానాలు, బీఆర్ఎస్- 22 నుంచి 31 స్థానాలు, బీజేపీ- 6 నుంచి 9 స్థానాలు, ఎంఐఎం- 6 నుంచి 7 స్థానాలు వస్తాయని పేర్కొంది.

పోల్ ట్రెండ్స్ అండ్ స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్స్ సర్వే చూస్తే కాంగ్రెస్- 65 నుంచి 68 స్థానాలు, బీఆర్ఎస్- 35 నుంచి 40 స్థానాలు, బీజేపీ- 7 నుంచి 10 స్థానాలు, ఇతరులు- 6 నుంచి 9 స్థానాలు వస్తాయని వెల్లడించింది.

ఇక సీఎన్ఎన్ ఎగ్జిట్ పోల్స్ సర్వేను తీసుకుంటే కాంగ్రెస్-56 స్థానాలు, బీఆర్ఎస్- 48 స్థానాలు, బీజేపీ- 10 స్థానాలు, ఇతరులు- 5 స్థానాలు వస్తాయని వెల్లడించింది. మొత్తానికి చూస్తే కాంగ్రెస్ గెలిచి తీరుతుందని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు బల్ల గుద్దుతున్నాయి. డిసెంబర్ 3న రియల్ రిజల్ట్స్ వస్తాయి.

Tags:    

Similar News