రేవంత్‌ను కాంగ్రెస్ భర్తీ చేస్తుందా..? అంత డేర్ చేస్తుందా..?

పార్టీకి ఊపును తీసుకురావడంలో రేవంత్ సక్సెస్ అయ్యారు. నిత్యం ఢిల్లీ పెద్దలతో టచ్‌లో ఉంటూనే రాష్ట్రంలో పార్టీకి జీవం వచ్చేలా చేశారు.

Update: 2024-11-04 11:34 GMT

తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కొత్త రాష్ట్రంలో దయనీయంగా ఉండేది. పార్టీకి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన క్రెడిట్ కూడా దక్కలేదు. దాంతో పెద్ద ఎత్తున కాంగ్రెస్ లాస్ అవ్వాల్సి వచ్చింది. పెద్ద ఎత్తున కేడర్‌ను కోల్పోవాల్సి వచ్చింది. అసలు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పేరే వినిపించని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత సీన్ రివర్స్ అయింది. పార్టీకి ఊపును తీసుకురావడంలో రేవంత్ సక్సెస్ అయ్యారు. నిత్యం ఢిల్లీ పెద్దలతో టచ్‌లో ఉంటూనే రాష్ట్రంలో పార్టీకి జీవం వచ్చేలా చేశారు.

పదేళ్ల తరువాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడంలో రేవంత్ కృషి గురించి ఎంత చేప్పినా తక్కువే. రేవంత్ వల్లే కాంగ్రెస్ పార్టీకి మునుపటి జవసత్వాలు వచ్చాయనేది అందరూ అంటున్న మాటే. అదే ధోరణితో అసెంబ్లీ ఎన్నికల వేళ రేవంత్ కష్టపడిన తీరు ప్రజలను మెస్మరైజ్ చేసింది. ఆయన కార్యాచరణలు, ఆయన ప్లానింగులు చివరకు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలా చేశాయి.

రేవంత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి పది నెలలు గడిచిపోయింది. అయితే.. తాజాగా ఓ కొత్త ప్రచారం తెరమీదకు వచ్చింది. దాంతో రేవంత్ అభిమానులంతా గందరగోళానికి గురవుతున్నారు. త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం భర్తీ చేయవచ్చన్న పుకార్లు షికారు చేస్తున్నారు. అయితే.. ఇందులో ఏ మాత్రం వాస్తవం ఉందో తెలియదు కానీ.. ప్రచారం మాత్రం జోరందుకుంది.

ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వంపై అధిష్టానం చాలా వరకు సీరియస్‌గా ఉంది. అక్కడ అమలు సాధ్యం కాని హామీలు ఇవ్వడం.. ఇప్పుడు వాటిలో నుంచి ఒక్కొ్క్కటిగా తొలగించాలని చూస్తుండడంతో ఇటీవలే కాంగ్రెస్ చీఫ్ ఖర్గే అక్కడి ప్రభుత్వంపై మండిపడ్డారు. బడ్జెట్‌కు అనుగుణంగానే హామీలు ఇవ్వాలని, ఇష్టారాజ్యంగా ఇచ్చుకుంటే పోతే రాష్ట్రం దివాలా తీసే పరిస్థితులు వస్తాయని హెచ్చరించారు. హైకమాండ్ దృష్టిలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విమర్శలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు అక్కడి.. డిప్యూటీ సీఎం కూడా ఆయనకు గట్టి పోటీదారుగా ఉన్నారు. అటు కర్ణాటకలోని పాలనపై ప్రజలు కూడా సంతృప్తిగా లేరు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపైనా అంతగా సంతోషంగా లేరు. అయితే.. సిద్ధరామయ్యను భర్తీ చేస్తారనే ఊహాగానాలు చాలా వరకు వినిపిస్తున్నాయి. కానీ.. ఇంతవరకైతే ఎలాంటి చర్యలకు దిగలేదు.

అయితే.. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో లేదు. ఒకవేళ అధికారంలో ఉండి ఉంటే ఆ బలం వేరే ఉండేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ అక్కడి ముఖ్యమంత్రులను టచ్ చేసే ధైర్యం అధిష్టానం చేస్తుందా అన్న సందేహాలు వినిపిస్తున్నాయి. ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా రెండు రాష్ట్రాల్లోనూ స్ట్రాంగ్ అయి ఉన్నారు. తెలంగాణలోనూ రేవంత్ రెడ్డి పట్ల కాస్త పాజిటివ్ వాతావరణమే కనిపిస్తోంది. ఈ క్రమంలో ఒకవేళ కర్ణాటక ముఖ్యమంత్రిని భర్తీ చేయాలనుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ జోలికి రాకపోవచ్చన్న ప్రచారం జరుగుతోంది.

Tags:    

Similar News