మోహన్ బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ... వాట్ నెక్స్ట్?
అవును... తెలంగాణ హైకోర్టులో మంచు మోహన్ బాబుకు బిగ్ షాక్ తగిలింది. ఇందులో భాగంగా.. జర్నలిస్టు పై దాడి కేసులో మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది.
ఇటీవల కాలంలో మోహన్ బాబు ఫ్యామిలీలో తగాదాల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... తనను గుర్తు తెలియని వ్యక్తులు కొట్టారని, తనకు ప్రాణహాని ఉందని మంచు మనోజ్ ఫిర్యాదు చేయగా.. తన కుమారుడు మనోజ్ వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ మోహన్ బాబు ఫిర్యాదు చేశారు.
దీంతో ఒక్కసారిగా ఈ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. ఈ క్రమంలో గత మంగళవారం రాత్రి జల్ పల్లిలోని తన నివాసం వద్ద తన కుమారుడితో పాటు ఇంటి ఆవరణలోకి వెళ్లిన జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి చేశారు. దీంతో.. ఆయనపై హత్యాయత్నం కేసు నమోదైంది. తాజాగా ఆ కేసుకు సంబంధించి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
అవును... తెలంగాణ హైకోర్టులో మంచు మోహన్ బాబుకు బిగ్ షాక్ తగిలింది. ఇందులో భాగంగా.. జర్నలిస్టు పై దాడి కేసులో మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ సమయంలో సోమవారం వరకూ అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆయన తరుపు న్యాయవాది కోరగా.. కౌంటర్ దాఖలు చేశాకే తీర్పు ఇస్తామని కోర్టు తెలిపింది.
అనంతరం.. తీర్పును ఈ నెల 23 (సోమవారం) కి వాయిదా వేసింది న్యాయస్థానం. దీంతో... పోలీసుల నెక్స్ట్ స్టెప్ ఏమిటనే చర్చ తెరపైకి వచ్చిందని అంటున్నారు. మరోపక్క ఇటీవల ఈ వ్యవహారంపై స్పందించిన రాచకొండ సుధీర్ బాబు... మోహన్ బాబు అరెస్టు విషయంలో ఎక్కడా ఆలస్యం లేదని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో... ఇప్పటికే నోటీసు ఇచ్చామని, అయితే ఈ నెల 24వ తేదీ వరకూ ఆయన సమయం అడిగారని, అదే తేదీ వరకూ తెలంగాణ హైకోర్టు కూడా మోహన్ బాబుకు మినహాయింపు ఇచ్చిందని తెలిపారు. నోటీసులకు స్పందించని పక్షంలో అరెస్ట్ చేసే అవకాశం ఉందని సీపీ సుధీర్ బాబు తెలిపారు!