తెలంగాణ వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఇక ఆ వెహికల్స్ ఇక తుక్కుకే..

వాహనాల పొగతో హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల్లో కాలుష్యం రోజురోజుకూ ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది.

Update: 2024-09-19 11:46 GMT

తెలంగాణ రాష్ట్రంలో వాహనదారులు అలర్ట్ కావాల్సిన సమయం ఆసన్నమైంది. అదేంటి.. వాహనదారులు అలర్ట్ కావడం ఎందుకు అని ఆశ్చర్యపోకండి. 15 ఏళ్లకు పైబడిన వాహనాలు వాడుతున్న వారికోసమే ఈ న్యూస్. వాహనాల పొగతో హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల్లో కాలుష్యం రోజురోజుకూ ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. దానిని అరికట్టేందుకు రవాణా శాఖ అధికారులు దృష్టి సారించారు. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు.

15 ఏళ్లు దాటిన టూ, త్రీ, ఫోర్ వీలర్ వాహనాలను ఇకపై రోడ్లపై అనుమతించరు. వాటిని తుక్కుగా మార్చాలిందేనని రవాణా శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. త్వరలోనే ఆర్వీఎస్ఎఫ్ (రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాప్ ఫెసిలిటీ) పేరుతో కొత్త పాలసీని తీసుకురాబోతోంది. ఇప్పటికే ఈ పాలసీని మహారాష్ట్ర, కర్నాటక, కేరళ రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో పర్యటించిన రాష్ట్ర రవాణా శాఖ అధికారులు తెలంగాణ రాష్ట్రంలోనూ ఈ పాలసీ తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో టూ, త్రీ, ఫోర్ వీలర్స్ వెహికల్స్ కోటికి పైగానే ఉండగా.. వాటిలో సుమారు 20 లక్షలకు పైగా 15 ఏండ్లు పైబడిన వాహనాలు ఉన్నట్లు అంచనా. ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌లోనే సుమారు 10 లక్షలకు పైగా పాత వాహనాలు ఉన్నట్లు అధికారులు లెక్కలు వేస్తున్నారు. దాదాపు వెయ్యి ఆర్టీసీ బస్సులు కూడా ఈ కేటగిరిలో ఉన్నట్లు తెలుస్తోంది. వాటితోపాటు దాదాపు 2వేల స్కూల్ బస్సులు ఉన్నాయట. అయితే.. కాలం చెల్లిన వాహనాలను స్క్రాప్ కింద మార్చేందుకు టెండర్లకు ఆహ్వానించాయి. ఇందుకు టాటా, మహీంద్రా, మరో కంపెనీ ముందుకు వచ్చాయి.

ప్రస్తుతం ఈ కంపెనీలు హైదరాబాద్‌తోపాటు మరో రెండు చోట్ల పాత వెహికల్స్‌ను స్క్రాప్ కింద మార్చే యూనిట్లను ప్రారంభించాయి. వెహికల్ స్క్రాప్ పాలసీతోపాటు పొల్యూషన్‌ను కంట్రోల్ చేయవచ్చని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. పాత వాహనాల ద్వారా పలు నేరాలు సైతం జరుగుతున్నాయని ఇటు పోలీసులు చెబుతున్నారు. పాత ఓనర్ పేరు మీదనే వాహనం ఉండడంతో.. పలువురు దానిని ఆసరాగా చేసుకొని ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని అంటున్నారు. అలాంటి కేసుల్లో క్రిమినల్స్‌ను పట్టుకోవడం కూడా కష్టమవుతోందని అభిప్రాయం చెప్తున్నారు. అందుకే.. పాత వెహికల్స్‌ను స్క్రాప్ కింద మార్చేందుకు ఈ కొత్త పాలసీని అమల్లోకి తేనున్నారు.

ఈ పాలసీ ప్రకారం వాహనాన్ని తుక్కు కింద మలుస్తారు. ఇనుప తక్కు ఎన్ని కిలోలు ఉంటే.. అన్ని కిలోలకు మార్కెట్ ధర ప్రకారం చెల్లిస్తారు. అలాగే.. వెహికల్ ఓనర్‌కు ఓ సర్టిఫికెట్ ఇస్తారు. అతను కొత్త వాహనం కొనుగోలు చేసేటప్పుడు ఆ సర్టిఫఇకెట్ చూపిస్తే 10శాతం డిస్కౌంట్ ఇస్తారు. అయితే.. అవసరమైన ఫిట్‌నెస్ పరీక్షల్లో పాస్ అయితే గ్రీన్ ట్యాక్స్ చెల్లించి మూడు నుంచి ఐదేళ్లు అదనంగా నడుపుకోవచ్చు. ఒకవేళ ఫిట్‌నెస్‌లో ఫెయిల్ అయితే వాహనాలు మాత్రం స్క్రాప్‌కు తరలించాల్సిందే.

Tags:    

Similar News