తెలంగాణాలో ఆ 26 సీట్లే డిసైడింగ్ ఫ్యాక్టర్ అంట...?

తెలంగాణాలో హోరా హోరీ పోరు సాగుతోంది అని అందరికీ తెలిసిందే. అధికార బీయారెస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నది ఒక పొలిటికల్ పిక్చర్ అయితే ఇపుడు స్పష్టంగా బయటకు వస్తోంది.

Update: 2023-11-02 11:13 GMT

తెలంగాణాలో హోరా హోరీ పోరు సాగుతోంది అని అందరికీ తెలిసిందే. అధికార బీయారెస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నది ఒక పొలిటికల్ పిక్చర్ అయితే ఇపుడు స్పష్టంగా బయటకు వస్తోంది. ఈ ముఖా ముఖీ పోరు కూడా రసవత్తరంగా ఉంటుంది అని అంచనా కడుతున్నారు. ఈ నేపధ్యంలో వివిధ సర్వేలు కూడా వెలువడుతూ అటు బీయారెస్ కి ఇటు కాంగ్రెస్ కి ఆనందం కలిగించే విధంగా నంబర్లు ఇస్తున్నాయి.

అయితే ఒక ప్రముఖ చానల్ తో ఒక ప్రముఖ కాంట్రాక్టర్ చేయించిన సర్వేలో చిత్రంగా ఫలితాలు వచ్చాయని అంటున్నారు. ఆ రిజల్ట్స్ కనుక చూస్తే ఇలా ఉన్నాయి. కాంగ్రెస్ కి 50, బీయారెస్ కి 30, బీజేపీకి 6, మజ్లీస్ కి 7 అని లెక్క వేశారు. ఇక పోటాపోటీగా ఉన్న సీట్లను 26గా తేల్చారు. ఇక్కడ భీకరమైన పోరు సాగనుంది అని అంటున్నారు.

ఈ పోరులో ఒక్క ఓటు అటూ ఇటూ అయినా ఫలితం మారే విధంగా ఉన్నది పరిస్థితి అని అంటున్నారు. ఈ 26 సీట్లే ఇపుడు తెలంగాణాలో కీలకంగా మారాయని అంటున్నారు. ఇక ఈ ప్రముఖ చానల్ కి సర్వే చేసిన సంస్థ వారు నేషనల్ పార్టీకి చేసిన ట్రాక్ రికార్డుని కలిగి ఉన్నారని అంటున్నారు.

ఇక చూస్తే ఈ మొత్తం 26 సీట్లలో బీయారెస్ 18 సీట్లను గెలుస్తుంది అని కూడా ఈ సర్వే నివేదికలో చెబుతున్నారు. ఇవి పోనూ మిగతావి కాంగ్రెస్ గెలుస్తుంది అని అంటున్నారు. అంటే కాంగ్రెస్ కి 9 సీట్లు ఇచ్చినట్లు అవుతుంది అన్న మాట. ఇప్పటికే కాంగ్రెస్ కి 50 సీట్లు ఉన్నాయి. మరి ఈ తొమ్మిది కలిస్తే కచ్చితంగా సింపుల్ మెజారిటీకి చేరువ అవుతుంది ఆ పార్టీ ని అంటున్నారు. అపుడు అతి తక్కువ మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం పక్కా అని అంటున్నారు.

అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఈ 26 సీట్లలో బీయారెస్ కి ఎక్కువ సీట్లు వస్తే మాత్రం అపుడు బీయారెస్ బీజేపీ ప్రభుత్వం ఏర్పాట్లు అయ్యేందుకు చాన్స్ ఉంది అని అంటున్నారు. అంటే ఈ 26లో బీయారెస్ కి 20 సీట్లు వస్తే పాత ముప్పయితో ఇవి కలిపిస్తే యాభై సీట్లు అవుతాయి. అలా చూసుకుంటే బీజేపీకి ఆరు సీట్లు మజ్లీస్ కి ఏడు సీట్లు ఉంటాయి కాబట్టి అలా మరోసారి బీయారెస్ ప్రభుత్వం వస్తుంది అని అంటున్నారు.

అయితే అది కూడా అంత సులువు కాదు అని మరో వాదన ఉంది. బీజేపీకి దోస్త్ అని ఇప్పటికే మజ్లీస్ మీద విమర్శలు ఉన్న టైం లో అపుడు మజ్లీస్ కీలకం అవుతుంది. ఆ పార్టీ కాంగ్రెస్ వైపు మొగ్గితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినా ఆశ్చర్యం లేదు. ఏది ఏమైనా తెలంగాణాలో చూస్తే వచ్చేది ఏ ప్రభుత్వం అన్న దాని మీద రకరకాలైన సర్వేలు వస్తున్నాయి.

ఇక అదే సమయంలో మజ్లీస్, బీజేపీ మీద కూడా చర్చ సాగుతోంది. మజ్లీస్ సీట్లు తగ్గించడం బీజేపీ ఓట్లు తగ్గించడం ద్వారా పూర్తి మెజారిటీ సాధించేలా కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది.అందుకే ఆ రెండు పార్టీలను బీయారెస్ తో కట్టి మరీ ప్రచారం చేస్తోంది. ఇది రాహుల్ గాంధీ నుంచి రేవంత్ రెడ్డి దాకా అలాగే ప్రచారం చేస్తూ వస్తున్నారు. మరి ఆ ప్రభావం కనుక పడితే అపుడు తెలంగాణాలో హంగ్ రానే రాదు అని అంటున్నారు. అలా కింగ్ అయ్యే చాన్స్ కూడా కాంగ్రెస్ కి దక్కినా దక్కవచ్చు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News