సారు టచ్ లోకి వెళ్లిన 15 మంది ఎవరు? వారి నాయకుడు ఎవరు?
ఈ క్రమంలో ఎలాంటి ట్విస్టులు లేకుండా పరిణామాలు స్మూత్ గా జరిగాయనుకోవటం తప్పన్న విషయం స్పష్టమైందన్న మాట బలంగా వినిపిస్తోంది
ఈ వార్త మీరు చదివే సమయానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారోత్సవం చేసేందుకు కొన్ని గంటల సమయమే మిగిలి ఉంటుంది. గడిచిన మూడు రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మాట్లాడుకున్న విషయానికి సంబంధించిన విశ్వసనీయ సమాచారం మాకు అందింది. షాకింగ్ గా ఉన్న ఈ అంశంపై కాంగ్రెస్ అధినాయకత్వం తక్షణం రియాక్టు కాకుంటే.. అందుకు చెల్లించాల్సిన మూల్యం చాలా ఎక్కువగా ఉంటుంది.
ఇంతకూ విషయం ఏమంటే.. ఆదివారం ఎన్నికల ఫలితాలు వెలువడే వేళలో.. ఓట్ల లెక్కింపు మొదలైన మొదటి రెండు మూడు గంటల్లోనే కాంగ్రెస్ విజయంపై ధీమా వ్యక్తమైంది. ఈ క్రమంలో ఎలాంటి ట్విస్టులు లేకుండా పరిణామాలు స్మూత్ గా జరిగాయనుకోవటం తప్పన్న విషయం స్పష్టమైందన్న మాట బలంగా వినిపిస్తోంది.
ఓవైపు ఓట్ల లెక్కింపు జరుగుతున్న వేళ.. గులాబీ పార్టీకి సీట్ల సంఖ్య తక్కువ పడుతున్న వైనంపై కిందా మీదా పడుతున్న వేళలో.. కాంగ్రెస్ పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ టచ్ లోకి వెళ్లినట్లుగా చెబుతున్నారు. తాము పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నామని.. ఓకే అంటే చాలు.. తదుపరి పరిణామాల్ని తాము చూసుకుంటామన్న విషయాన్ని గులాబీ బాస్ కు నేరుగా తెలియజేసినట్లుగా చెబుతున్నారు. ఫలితాలు గెలుపునకు దగ్గరగా వస్తే.. అదో పద్దతి. కానీ.. అందుకు భిన్నంగా గ్యాప్ ఎక్కువగా ఉండటంతో తొందరపాటు అవసరం లేదన్న మాటను చెప్పి వెనక్కి పంపించేసిన వైనం ఆలస్యంగా బయటకు వచ్చింది.
ఈ వ్యవహారంలో సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు పార్టీకి ద్రోహం చేసేందుకు వెనుకాడని తత్త్వం అధినాయకత్వానికి సమాచారం వెళ్లినట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. టచ్ లోకి వెళ్లిన నేతలకు ఇప్పటికిప్పుడు పార్టీ మారాల్సిన అవసరం లేదని.. అన్నీ చూసుకొని తానే కబురు పంపుతానని గులాబీ బాస్ సర్దిచెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ కారణంగానే ఎవరూ ఏమీ మాట్లాడకుండా ఉన్నట్లు చెబుతున్నారు.
బయట జరుగుతున్న ప్రచారానికి తగ్గట్లే తెర వెనుక కూడా అధికారం కోసం జరుగుతున్న వైనాలు సంచలనంగా మారాయి. అసలు ట్విస్టు ఏమంటే.. ఈ మొత్తం స్టోరీని కాంగ్రెస్ అధినాయకత్వం పక్కాగా తెలుసుకోవటమేకాదు.. తోక జాడించే విషయంలోనూ వారి తీరుకు చెక్ పెట్టేలా కాంగ్రెస్ ఎత్తులకు పైఎత్తులు వేస్తూ.. ముందుకు వెళుతున్నారు. అయితే.. ఇలాంటి వారికి చెక్ పెట్టేందుకు వీలుగా ఒక ఫార్ములాను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. తోక జాడించే వారిని.. రానున్న రోజుల్లో ఏం చేస్తారన్నది సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.