తెలంగాణకు కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టో.. కీలక అంశాలివే!
సార్వత్రిక ఎన్నికల వేళ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టింది. సార్వత్రిక ఎన్నికలు అంటే
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని అందుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలను పునరావృతం చేయాలని భావిస్తోంది. మొత్తం 17 లోక్ సభ స్థానాల్లో 12కు పైగా స్థానాల్లో విజయం ఖాయమని విశ్వసిస్తోంది.
ఈ నేపథ్యంలో తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇందులో ఏపీలో కలిపిన 5 గ్రామాలను మళ్లీ రాష్ట్రంలో విలీనం చేయడం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదా కల్పించడం వంటి ప్రధాన హామీలు ఉన్నాయి.
ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా చేసే చేపట్టబోయే పనుల గురించి మేనిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణకు ప్రత్యేకంగా మేనిఫెస్టోను విడుదల చేసింది. తెలంగాణకు ప్రత్యేక హామీల పేరుతో విడుదల చేసిన ఈ మేనిఫెస్టోను కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ విడుదల చేశారు. ఇందులో 23 అంశాలు ఉన్నాయి.
తెలంగాణలో అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఈ మేనిఫెస్టోను తయారుచేశామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. కేంద్రంలో తాము అధికారంలోకి రాగానే రాష్ట్ర విభజన చట్టం హామీలు అమలు చేస్తామని వెల్లడించారు. క్రీడలను ప్రోత్సహిస్తామని తెలిపారు. మేడారం జాతరకు జాతీయ హోదా కల్పిస్తామని వెల్లడించారు. అదేవిధంగా సుప్రీంకోర్టు ప్రత్యేక బెంచ్‌ను హైదరాబాద్ లో నెలకొల్పుతామన్నారు.
తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక మేనిఫెస్టోలో కీలక అంశాలు:
1. హైదరాబాద్ మహానగరానికి బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఐఆర్) ప్రాజెక్ట్ పునఃప్రారంభం
2. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం – 2014 ప్రకారం కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు కర్మాగారం, హైదరాబాద్ లో ఐఐఎం,
హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి పక్క నుండి వేగవంతమైన రైల్వే వ్యవస్థ, మైనింగ్ విశ్వవిద్యాలయం ఏర్పాటు
3. భద్రాచలం అభివృద్ధిగా అడ్డుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం– 2014 ప్రకారం ఆంధ్రాలో విలీనం అయిన ఐదు గ్రామాలు.. ఎటపాక, గుండాల, పురుషోత్తంపట్నం, కన్నెగూడెం, పిచుకలపాడులు తిరిగి తెలంగాణాలో విలీనం.
4. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదా
5. నీతి అయోగ్ ప్రాంతీయ కార్యాలయం హైదరాబాదులో ఏర్పాటు.
6. నూతన విమానాశ్రయాల ఏర్పాటు
7. రామగుండం–మణుగూరు మధ్య నూతన రైల్వే లైన్ ఏర్పాటు
8. నాలుగు నూతన సైనిక పాఠశాలల ఏర్పాటు
9. కేంద్రీయ విద్యాలయాల సంఖ్య పెంపు.
10. నవోదయ విద్యాలయాల సంఖ్య రెట్టింపు
11, జాతీయ క్రీడల విశ్వవిద్యాలయం ఏర్పాటు
12. ఐఐఎస్‌ఈఆర్ ఏర్పాటు
13. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ) ఏర్పాటు
14. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ క్యాంపస్ ఏర్పాటు
15. నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు
16. అధునాతన వైద్య పరిశోధనల కోసం ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ పరిధిలో కేంద్ర వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటు
17. 73 – 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం కేంద్ర ప్రభుత్వ నిధులు గ్రామ సర్పంచులకు నేరుగా బదిలీ
18. ప్రతి ఇంటికి సౌర శక్తితో కూడిన సొంత విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థ ఏర్పాటు
19. హైదరాబాద్– బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ – నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ –వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ నుండి నల్గొండ మీదుగా మిర్యాలగూడ ఇండస్ట్రియల్ కారిడార్, సింగరేణి పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు
20. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సాంస్కృతిక, వినోద కేంద్రం
21. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా
22. హైదరాబాదులో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు
23. డ్రైపోర్టు ఏర్పాటు