తెలంగాణ ఎన్నిక‌ల్లో ప్ర‌చార ప‌ద‌నిస‌లు.. కాంగ్రెస్ వీడియోల హ‌ల్చ‌ల్‌!

ఇక‌, స‌ర్వేలు కూడా అంతో ఇంతో అనుకూల‌మ‌ని తేల్చి చెప్ప‌డంతో ఈ ప్ర‌చారాన్ని మ‌రింత తీవ్ర‌తరం చేస్తున్నారు.

Update: 2023-11-10 08:52 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకోవాల‌ని గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్న అన్ని పార్టీలూ.. ప్ర‌చా రానికి ప‌దును పెంచాయి. మ‌రో 20 రోజులు మాత్ర‌మే ఎన్నిక‌ల ప్ర‌చారానికి అవ‌కాశం ఉండ‌డంతో (న‌వంబ‌రు 30న పోలింగ్‌).. ప్ర‌త్య‌ర్థుల‌పై పైచేయి సాధించేందుకు అధికార బీఆర్ ఎస్ నుంచి ప్ర‌త్య‌ర్థి పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు దూకుడుగా ప్ర‌చారం చేస్తున్నాయి.

ఇప్ప‌టికే బీఆర్ ఎస్ త‌ర‌ఫున సీఎం కేసీఆర్ స్టార్ క్యాంపెయినర్‌గా జిల్లాలు చుట్టేస్తున్నారు. ఇక‌, స‌ర్వేలు కూడా అంతో ఇంతో అనుకూల‌మ‌ని తేల్చి చెప్ప‌డంతో ఈ ప్ర‌చారాన్ని మ‌రింత తీవ్ర‌తరం చేస్తున్నారు. మ‌రోవైపు మంత్రులు కేటీఆర్‌.. హ‌రీష్ రావు కూడా ప్ర‌చారంలో ముందున్నారు. ఇక‌, కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. మ‌రోవైపు.. బీజేపీ ప‌క్షాన కూడా నాయ‌కులు ప్ర‌చారంలో త‌ల‌మున‌క‌ల‌య్యారు.

ఈ క్ర‌మంలోనే ఒక‌రిపై ఒక‌రు మాట‌ల తూటాలు పేల్చుకుంటున్నారు. విమ‌ర్శ‌లు-ప్ర‌తి విమ‌ర్శ‌లు, స‌వాళ్లు-ప్ర‌తిస‌వాళ్లు విరుసుకుంటున్నారు. ఇదిలావుంటే.. తెలంగాణ ఇచ్చామ‌ని చెప్పుకొంటున్న‌ కాంగ్రెస్ వైపు ప్ర‌జ‌లు మొగ్గు చూపే అవ‌కాశం ఉంద‌ని స‌ర్వేలు చెబుతున్న నేప‌థ్యంలో అధికార పార్టీ బీఆర్ ఎస్ కొంత దూకుడు పెంచింది. ఒక‌వైపు నాయ‌కుల ప్ర‌చారం సాగుతుండ‌గానే.. మ‌రోవైపు సోష‌ల్ మీడియా, ప్ర‌ధాన మీడియా స‌హా సినిమాలు, టీవీల ద్వారా కూడా ప్ర‌చారాన్ని తీవ్ర‌త‌రం చేసింది.

ఇక‌, కాంగ్రెస్ గ‌తానికి భిన్నంగా త‌న ప్ర‌చారంలో మ‌సాలా ఉండేలా చూసుకుంటోంది. స‌మ‌కాలీన స‌మాజానికి హ‌త్తుకునేలా వ్యాఖ్య‌లు చేయ‌డంతోపాటు.. బీఆర్ ఎస్ ప్ర‌భుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమ‌ర్శ‌లు సంధిస్తుండ‌డం గ‌మ‌నార్హం. దీనికి సంబంధించిన ప్ర‌క‌ట‌న‌లు సోష‌ల్ మీడియా స‌హా ప్ర‌ధాన టీవీలు, ప‌త్రిక‌ల్లో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి.

వీడియోల హ‌వా..

కాంగ్రెస్ వీడియో ప్రచారంలో ఒక ప్రత్యేకత ఏమిటంటే, కేసీఆర్‌ను పోలిన పాత్రతో కూడిన చమత్కార ప్రకటనలు, ఇక్కడ ఆయ‌న తన మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నట్లు కనిపిస్తాడు, ప్రజలు ఆయ‌న‌ను నాటకీయంగా తిప్పికొట్టారు. అద్భుతమైన, చిరస్మరణీయ దృశ్యంగా ఈ ప్రకటనలు సాగుతున్నాయి. పదునైన, ప్రభావవంతమైన సందేశాలతో రూపొందించిన ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

గతంలో, కాంగ్రెస్ ప్రచారాలలో విమ‌ర్శ‌లు మాత్ర‌మే ఉండేవి. కానీ, ఇప్పుడు సృజనాత్మకత‌, తాజా అంశాల‌కు, యువ‌త‌ను ఆక‌ర్షించేందుకు నూత‌న‌ విధానాన్ని తీసుకున్నారు. ఇలా కాంగ్రెస్ నుండి ఇటువంటి అధునాతన, దూకుడు ప్రకటనలు కనిపించడం ఆసక్తిగా మారింది.

Full View
Full View
Tags:    

Similar News