తెలంగాణ ఎగ్జిట్ పోల్స్... ఆసక్తికరంగా పీటీఎస్ గ్రూప్ ఫలితాలు!
తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది! దీంతో... ఎగ్జిట్ పోల్స్ ఫలితాల సందడి మొదలైంది
తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది! దీంతో... ఎగ్జిట్ పోల్స్ ఫలితాల సందడి మొదలైంది. ఇందులో భాగంగా "పీటీఎస్ గ్రూప్" తాజాగా జరిగిన తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించింది. ఈ ఫలితాలు జిల్లాల వారీగా కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫలితాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.
అవును... పీటీఎస్ గ్రూప్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఫలితాల ప్రకారం...
బీఆరెస్స్: 35 - 40 (+/-5)
కాంగ్రెస్: 65 - 68 (+/-5)
బీజేపీ: 7 - 10 (+/-3)
ఎంఐఎం: 6 - 7
ఇతరులు: 1 - 2 స్థానాలు గెలుపొందే అవకాశం ఉందని తెలుస్తుంది.
ఇదే క్రమంలో ఉమ్మడి జిల్లాల వారీగా ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను పరిశీలిస్తే...
ఆదిలాబాద్: బీఆరెస్స్ 0 - 3; కాంగ్రెస్ 4 - 6; బీజేపీ 2 - 4; ఇతరులు 0 - 1
నిజామాబాద్: బీఆరెస్స్ 3 - 5; కాంగ్రెస్ 3 - 4; బీజేపీ 1 - 2
కరీంనగర్: బీఆరెస్స్ 2 - 4; కాంగ్రెస్ 7 - 9; బీజేపీ 1 - 2
మెదక్: బీఆరెస్స్ 4 - 6; కాంగ్రెస్ 4 - 6
మహబూబ్ నగర్: బీఆరెస్స్ 2 - 4; కాంగ్రెస్ 9 - 12
రంగారెడ్డి: బీఆరెస్స్ 5 - 7; కాంగ్రెస్ 5 - 7; బీజేపీ 0 - 2
హైదరాబాద్: బీఆరెస్స్ 5 - 7; కాంగ్రెస్ 2 - 4; బీజేపీ 1 - 2; ఎంఐఎం 6 - 7
వరంగల్: బీఆరెస్స్ 3 - 5; కాంగ్రెస్ 7 - 9
నల్గొండ: బీఆరెస్స్ 0 - 3; కాంగ్రెస్ 9 - 11; బీజేపీ 0 - 1
ఖమ్మం: బీఆరెస్స్ 0 - 2; కాంగ్రెస్ 7 - 9; ఇతరులు 0 - 1
ఈ సంస్థ ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కన్ ఫాం అన్నట్లుగా ఉండటానికి గల కొన్ని కారణాలను కూడా వెల్లడించింది. ఇందులో భాగంగా... బీఆరెస్స్ పార్టీకి వరుసగా రెండు సార్లు అవకాశం ఇచ్చాము కాబట్టి ఇప్పుడు వేరే పార్టీకి అవకాశం ఇస్తే బాగుంటుందని సగటు ఓటర్లలో మెజారిటీ ఓటర్లు భావించారని చెబుతుంది.
ఇదే సమయంలో... బీఆరెస్స్ పార్టీ మెజారిటీ సిట్టింగ్ అభ్యర్థులకు టిక్కెట్స్ కేటాయించడం వలన కొన్ని నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థులపై ఉన్న వ్యతిరేకత కూడా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుందని చెబుతుంది.