నాది కన్నింగ్‌ మెంటాలిటీ కాదు: తమిళి సై సంచలన వ్యాఖ్యలు!

తనది కన్నింగ్‌ మెంటాలిటీ కాదని తెలంగాణ గవర్నర్‌ తమిళి సై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-09-08 10:34 GMT

తనది కన్నింగ్‌ మెంటాలిటీ కాదని తెలంగాణ గవర్నర్‌ తమిళి సై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు సేవ చేయాలన్నా ఆలోచన తప్ప తనకు ఎలాంటి పొలిటికల్‌ ఎజెండా లేదని తేల్చిచెప్పారు. తనది మోసం చేసే తత్వం కాదన్నారు. కన్నింగ్‌ మెంటాల్టీ అసలే కాదన్నారు. పీపుల్‌ ఫ్రెండ్లీ గవర్నర్‌ గా ఉండాలన్నదే తన అభిమతమని తేల్చిచెప్పారు.

తాను రాజకీయాలు చేయడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో వివాదం పెట్టుకునే ఉద్దేశం కానీ, గొడవలు పడే ఉద్దేశం కానీ తనకు లేవని తమిళి సై వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సీనియర్‌ లీడర్‌.. పవర్‌ ఫుల్‌ నేత అని ఆమె కొనియాడారు. నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలన తాను చూస్తున్నానన్నారు. రాజభవన్‌ కి, ప్రగతి భవన్‌ కు మధ్య గ్యాప్‌ లేదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ తో తనకు ఎలాంటి దూరం లేదన్నారు. దూరం గురించి తాను పట్టించుకోనని.. తన దారి తనదేనని తమిళి సై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ గవర్నర్‌ గా నాలుగేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌ లోని రాజభవన్‌ లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. కేసీఆర్‌ పవర్‌ ఫుల్‌ లీడర్‌ అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో గొడవ పడే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. తనపై తెలంగాణ ప్రజలు చూపించిన ప్రేమ, అభిమానాలకు ధన్యవాదాలు చెబుతున్నానన్నారు.

ఈ సందర్భంగా ప్రొటోకాల్‌ వివాదంపైనా తమిళి సై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రొటోకాల్‌ ఉల్లంఘనతో తనను కట్టడి చేయలేరన్నారు. తెలంగాణ ప్రజలకు సేవ చేయడానికి తాను వచ్చానన్నారు. తెలంగాణ ప్రజల విజయమే తన విజయమని తెలిపారు.

తాను ఎక్కడ ఉన్నా తెలంగాణతో బంధం మరిచిపోనని తమిళి సై హామీ ఇచ్చారు. తాను సవాళ్లకు, పంతాలకు భయపడే వ్యక్తిని కాదన్నారు. కోర్టు కేసులకు, విమర్శలకు భయపడే రకం కాదని స్పష్టం చేశారు. తన బాధ్యతలు, విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ.. తెలంగాణలో గవర్నర్‌ గా నాలుగేళ్ల కాలం పూర్తి చేసుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

ప్రజలకు ఎంతో సేవ చేయాలని ఉన్నా గవర్నర్‌ ఆఫీస్‌ కు కొన్ని హద్దులున్నాయని తమిళి సై చెప్పారు. ప్రజలకు మరింత మెరుగ్గా సేవ చేయాలని ఉన్నా.. నిధుల కొరత ఉందని హాట్‌ కామెంట్స్‌ చేశారు.

తెలంగాణ బర్త్‌ డే– తన బర్త్‌ డే ఒకేరోజు అని తమిళి సై గుర్తు చేశారు. పుదుచ్చేరికి కూడా గవర్నర్‌ గా ఉన్నప్పటికీ తెలంగాణ ప్రజల కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నానని తెలిపారు. ఇక్కడ తాను జిల్లాలకు వెళ్తే ఐఏఎస్‌ అధికారులు రావడం లేదని హాట్‌ కామెంట్స్‌ చేశారు. కానీ, పుదుచ్చేరిలో సీఎస్‌ సహా చాలా మందిని పర్యవేక్షిస్తున్నానని తెలిపారు.

ఆర్టీసీ బిల్లుపై అనవసర కాంట్రవర్సీ జరిగిందని తమిళి సై అన్నారు. తాను ఆర్టీసీ కార్మికుల లబ్ధికోసమే ఆ బిల్లుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించానన్నారు. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ అనేదానికి కేటగిరీ ఉంటుందన్నారు. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలకు సంబంధించి ప్రభుత్వం కేటగిరీపై పూర్తిగా స్పష్టత ఇవ్వలేదని తెలిపారు. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ అనేది పొలిటికల్‌ నామినేషన్‌ కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News