"నీ అయ్యా కబ్జాదారుడు"... కొట్టుకున్న బీఅరెస్స్-బీజేపీ అభ్యర్థులు!

అవును... తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒక టీవీ ఛానల్ జనం మధ్యలో లైవ్ డిబేట్ పెట్టింది

Update: 2023-10-26 04:23 GMT

టీవీ లైవ్ డిబెట్లలో కొట్టుకోవడం గతంలో చాలా సార్లు చూశాం. టీవీ డిబేట్లలో ప్రజలంతా ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నారన్న ఇంగితం కూడా లేకుండా... పలువురు నాయకులు ఒకరిపై ఒకరు దుర్భాషలాడుకోవడం.. అనంతరం చొక్కాలు పట్టుకోవడం వంటి సంఘటనలు జరిగాయి! ఇదే సమయంలో తాజాగా రెండు పార్టీలకు చెందిన ఇద్దరు అభ్యర్థులు వేదికపై ముష్టి యుద్ధానికి దిగారు! దీంతో... అక్కడ యుద్ధ వాతావరణం ఏర్పడింది!

అవును... తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒక టీవీ ఛానల్ జనం మధ్యలో లైవ్ డిబేట్ పెట్టింది. మూడు పార్టీలకు చెందిన అభ్యర్థులు వేదికపై ఉన్నారు. ఆ ప్రాంతానికి, ప్రజలకు ఎవరు ఏమి మేలు చేశారు.. ఏ పార్టీ వల్ల ఆ ప్రాంతానికి జరిగిన ప్రయోజనాలు ఏమిటో చెప్పుకుంటారని భావించి ఆ చర్చాకార్యక్రమం ఏర్పాటుచేశారు! అయితే... ఈ డిబేట్ లో ఎవరు ఏమేమి అరాచకాలు చేశారు, ఎలాంటి భూకబ్జాలకు పాల్పడ్డారు వంటివి చర్చకు రావడం గమనార్హం! దీంతో ఇద్దరు నేతలు కొట్టుకున్నారు!

వివరాళ్లోకి వెళ్తే... తెలంగాణలో ఎన్నికల వాతావరణం వేడెక్కిన తరుణంలో ఓ న్యూస్ ఛానెల్ నిర్వహిస్తున్న ఓపెన్ డిబేట్‌ ను తాజాగా కుత్బుల్లాపూర్‌ లో నిర్వహించారు. ఈ డిబేట్‌ కు బీఅరెస్స్ అభ్యర్థి కేపీ వివేకానంద, బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్‌ తో పాటు కాంగ్రెస్ నేత కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూడు పార్టీల అభ్యర్థులు ఎవరి వెర్షన్ వారు వినిపిస్తున్నారు. ఈ సమయంలో వివేకానంద, శ్రీశైలం గౌడ్ మధ్య మాటల తూటాలు పేలాయి.

ఇందులో భాగంగా ఇద్దరూ గ్య్యాప్ ఇవ్వకుండా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఒక సందర్భంలో అవి మరింత పీక్స్ కి చేరాయి. స్టేజ్ పై వారిరువురూ గట్టిగా మాట్లాడుకుంటుంటే... స్టేజ్ కింద వారి కార్యకర్తలు వేడెక్కిపోతున్న పరిస్థితులు కనిపించాయి! దీంతో... నువ్వు కబ్జాదారునివంటే, నువ్వు కబ్జాదారునివంటూ ఇద్దరూ ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నారు. దీంతో వాతావరణం వేడెక్కడం మొదలైంది.

ఈ విధంగా... నువ్వు కబ్జాదారునివంటూ శ్రీశైలం ఆరోపణలు చేస్తుండగా.. వివేకానంద కూడా అదే స్థాయిలో కౌంటర్ అటాక్ చేశారు. ఈ క్రమంలోనే "నువ్వు కబ్జాదారుడువి, నీ అయ్యా కబ్జాదారుడు" అంటూ శ్రీశైలం గౌడ్ మాట తూలారు! దీంతో సహనం కోల్పోయారో ఏమో కానీ... వివేకానంద తీవ్ర కోపోద్రిక్తుడైపోయారు! క్షణాల వ్యవదిలో శ్రీశైలం గౌడ్ మీదికి దూకారు.. శ్రీశైలం గొంతుపట్టుకుని వెనక్కి తోశారు. ఈ అనూహ్య పరిణామంతో ఒక్కసారిగా అప్రమత్తమైన పోలీసులు వారిద్దరిని విడిపించారు.

ఇక అనూహ్య పరిణామంతో స్టేజ్ కింద ఉన్న కార్యకర్తలు కూడా కోపోద్రిక్తులయ్యారు. బారికేడ్లను తోసుకుంటూ.. కుర్చీలు ఎగరేసుకుంటూ.. అంతా కలిసి వేదికపైకి వచ్చే ప్రయత్నం చేశారు. ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకుని దాడులకు పాల్పడ్డారు. దీంతో అప్పటివరకు చర్చా గోష్టిగా ఉన్న వాతావరణం కాసేపట్లోనే రణరంగంగా మారింది. వాళ్లను నిలువరించటం పోలీసులకు తలకుమించిన భారంగా మారింది. అనంతరం కాసేపటికి వాతవారణం చల్లబడింది.

Tags:    

Similar News