గురువారానికి సుస్వాగతం అంటున్న తెలంగాణా రాజకీయం
రాజకీయ పార్టీలకు ఉన్నన్ని సెంటిమెంట్లు మరెవరికీ ఉండవు. వారు ఏ పని చేయాలన్నా మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తుంటారు.
రాజకీయ పార్టీలకు ఉన్నన్ని సెంటిమెంట్లు మరెవరికీ ఉండవు. వారు ఏ పని చేయాలన్నా మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తుంటారు. మంచి సమయంలో పని చేస్తే విజయాలు తప్పనిసరిగా తమను వరిస్తాయని గాఢంగా నమ్ముతారు.
అలా యావత్తు తెలంగాణా రాజకీయ సమాజం అంతా ఆగస్ట్ 17న వచ్చే గురువారం కోసం వేయి కళ్ళతో ఎదురుచూసింది. కళ్ళు కాయలు కాచేలా చూసింది. ఎందుకంటే హిందూ క్యాలెండర్ తో ఈ రోజుతో మంచి రోజులు మంచి ముహూర్తాలు వచ్చేశాయన్న మాట.
పవిత్రమైన శ్రావణమాసం ఈ రోజుతో మొదలవుతోంది. శ్రావణమాసం అంటే అన్నీ శుభాలే. అంతా మంచిగానే సాగుతుంది అన్నది ప్రగాఢ నమ్మకం. దాంతో అన్ని రాజకీయ పార్టీలు గురువారం కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూశాయి.
తీరా అంతా ఎదురుచూసిన గురువారం రానే వచ్చేసింది. దాంతో ఇపుడు తెలంగాణాలో కొద్ది నెలలలో ఎన్నికలు ముంచుకు వస్తున్న వేళ రాజకీయ పార్టీల దూకుడు ఒక ఒక లెవెల్ లో సాగుతుంది అని అంటున్నారు. అధికార బీయారెస్ నుంచి విపక్ష కాంగ్రెస్, బీజేపీ దాకా అన్ని పార్టీలూ జనంలోకి పోవడానికి శ్రావణమాసాన్ని మంచి ముహూర్తంగా ఎంచుకుంటున్నాయి.
నిజానికి నిన్నటిదాకా ఉన్న అధిక శ్రావణ మాసం అశుభంగా పరిగణించడంతో రాజకీయ కార్యకలాపాలు ఏవీ ఊపందుకోలేదు. ఇపుడు అంతా గాడిలో పడతారు అని అంటున్నారు. మరో వైపు చూస్తే అధికార బీయారెస్ తన అభర్ధుల జాబితాను ప్రకటించేందుకు ఇదే శ్రావణమాసాన్ని మంచి సమయంగా ఎంచుకుంది అని అంటున్నారు.
అందుకోసం లక్కీ డేట్స్ ని కూడా కొన్ని ఎంపిక చేసుకుంది అని అంటున్నారు. ఇక వచ్చే ఎన్నికలలో మరోసారి అధికారంలోకి రావడానికి సంక్షేమ పధకాలను కొత్తవి కూడా ఇదే నెలలో ప్రారంభించడానికి బీయారెస్ రెడీ అవుతోంది అనీంటున్నారు.
అంతే కాదు బీయారెస్ అధినేత, ముఖ్యమంత్రి అయిన కేసీయార్ ఇదే నెల నుంచి మొత్తం తెలంగాణ అంతటా సుడిగాలి పర్యటనలు చేయడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు అని అంటున్నారు. మొత్తం అన్ని జిల్లాలలో కేసీయార్ విస్తృతంగా పర్యటిస్తారు అని తెలుస్తోంది.
మరో వైపు చూస్తే కాంగ్రెస్ కూడా శ్రావణమాసం నుంచి తన యాక్టివిటీని పెంచుకోవడానికి చూస్తోంది అని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్ధులు అంతా దరఖాస్తు చేసుకోవాలని కాంగ్రెస్ ఆహ్వానిస్తోంది. ఈ మాసంలోనే కాంగ్రెస్ కూడా అభ్యర్ధుల ఎంపికకు రంగం సిద్ధం చేస్తోంది.
బీజేపీ వైపు చూస్తే ఆ పార్టీ కొత్త ప్రెసిడెంట్ జి కిషన్ రెడ్డి జనంలో ఉండేందుకు భారీ ఎత్తున పర్యటనలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అదే విధంగా బీజేపీ కీలక నేతలు కూడా జనంలోకి రావాలని చూస్తున్నారు. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే అన్ని పార్టీలూ రెడీ అవుతున్నాయి. రంగంలోకి దిగిపోతున్నాయి. ఆయా పార్టీల నుంచి సంచలన రాజకీయ ప్రకటనలు కూడా ఇదే నెలలో ఉండవచ్చు అని అంటున్నారు. మొత్తానికి గురువారం వచ్చింది తెలనగణా పొలిటికల్ గేర్ నే మార్చేసింది అని అంటున్నారు.