వరుణుడి ఉగ్రరూపం: ఏమిటీ రెడ్.. ఆరెంజ్.. ఎల్లో ఎలెర్టు?

వానలు పెద్ద పాయింట్ కాదు కానీ.. ఒక మోస్తరు దాటిన తర్వాత కురిసే వర్షాలతో ఎదురయ్యే ఇబ్బందులు అన్ని ఇన్ని కావు.

Update: 2024-09-01 07:00 GMT

వానలు పెద్ద పాయింట్ కాదు కానీ.. ఒక మోస్తరు దాటిన తర్వాత కురిసే వర్షాలతో ఎదురయ్యే ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. ఒక రోజు బాగా ఎండ కాస్తే జరిగే నష్టం కంటే.. ఒక రోజు తీవ్రచలితో చోటు చేసుకునే ఇబ్బందితో పోలిస్తే.. ఒక రోజు కురిసే భారీ వానతో జరిగే విధ్వంసం భారీగా ఉంటుంది. దాని నుంచి కోలుకోవటానికి నెలలు.. కొందరికి ఏళ్లు కూడా పడుతుంది. వాన బాగుంటుంది. కానీ.. భారీ వానతోనే అసలు భయమంతా. తాజా వాయిగుండం నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న పరిణామాలు.. కురిసిన వాన ఎంత తీవ్రమన్న సంగతి తెలిసిందే.

వర్షాలు భారీగా మారి.. దానికి మించి అత్యంత భారీగా మారిన వేళలో.. కొన్ని హెచ్చరికల్ని జారీ చేస్తుంది ప్రభుత్వం. అలాంటి అలెర్టులో అత్యంత తీవ్రమైనది రెడ్ అలెర్టు కాగా.. తర్వాతి స్థానంలో ఆరెంజ్.. దాని కంటే తక్కువగా ఉండేది ఎల్లో ఎలెర్టు. ఇంతకూ వీటిని ఎలా చెబుతారు? వీటి ఎఫెక్టు ఎంత ఎక్కువగా ఉంటుందన్నది చూస్తే.. ఈ ఎలెర్టులు ఎంత కీలకమన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.

రెడ్ ఎలెర్టు అంటే.. అత్యంత భారీ వర్షపాతం నమోదు అవుతుందని అర్థం. అంటే.. రోజులో 20.5 సెంటీమీటర్ల వర్షపాతానికి పైనే వర్షం కురిసే అవకాశం ఉంటే ఈ అలెర్టును ప్రకటిస్తారు. ఇక.. ఆరెంజ్ అలెర్టు విషయానికి వస్తే.. రోజులో 11.5 సెంటీమీటర్ల పైన వాన కురిసే అవకాశం ఉంటే.. ఈ హెచ్చరిక జారీ చేస్తారు. ఇక.. ఎల్లో అలెర్టు విషయానికి వస్తే రోజులో 6.4సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉంటే ఈ హెచ్చరికను జారీ చేస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో తాజాగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో తెలంగాణలోని ఏయే జిల్లాల్లో ఏయే అలెర్టులను జారీ చేశారన్నది చూస్తే..

రెడ్ అలెర్టు ఏయే జిల్లాలంటే..

ఆదిలాబాద్

నిర్మల్

నిజామాబాద్

కామారెడ్డి

మహూబూబ్ నగర్

నాగర్ కర్నూల్

వనపర్తి

నారాయణపేట

గద్వాల

ఆరెంజ్ అలెర్టు ఏయే జల్లాలంటే..

కుమురం భీం

మంచిర్యాల

జగిత్యాల

జయశంకర్ ములుగు

భద్రాద్రి కొత్తగూడెం

ఖమ్మం

వరంగల్

హనుమకొండ

జనగామ

వికారాబాద్

ఎల్లో అలెర్టులు ఏయే జిల్లాల్లో అంటే..

రాజన్న సిరిసిల్ల

కరీంనగర్

పెద్దపల్లి

నల్గొండ

సూర్యాపేట

మహబూబాబాద్

సిద్దిపేట

యాదాద్రి

రంగారెడ్డి

హైదరాబాద్

మేడ్చల్ మల్కాజిగిరి

మెదక్

ఏపీలోని ఏయే జిల్లాలకు రెడ్ అలెర్టు అంటే..

ఏలూరు

తూర్పుగోదావరి

కోనసీమ

పశ్చిమగోదావరి

క్రిష్ణా

గుంటూరు

పల్నాడు

ఎన్టీఆర్

Tags:    

Similar News