మెక్సికో డ్రగ్స్ ముఠాల ఘర్షణల్లో.... తెలుగు యూ-ట్యూబర్!

పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ గావిరియా.. కొలంబియాకు చెందిన డ్రగ్స్ వ్యాపారి. షార్ట్ కట్ లో ఇతడిని ఎస్కోబార్ గా పిలిచేవారు.

Update: 2024-09-21 14:30 GMT

పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ గావిరియా.. కొలంబియాకు చెందిన డ్రగ్స్ వ్యాపారి. షార్ట్ కట్ లో ఇతడిని ఎస్కోబార్ గా పిలిచేవారు. తన హవా సాగిన రోజుల్లో.. అమెరికాలో వాడే కొకైన్‌లో 80 శాతం ఎస్కోబార్ ముఠా రవాణా చేసినదే. అందుకే తడిని కొకైన్ కింగ్ అని అంటారు.

ఆండ్రెస్ ఎస్కోబార్.. జెంటిల్ మన్ గా పేరు. ఫుట్ బాల్ లో నీట్ గేమ్ కు పేరు. అలాంటిది 1994 ప్రపంచకప్ ఫుట్ బాల్ లో సెల్ఫ్ గోల్ కొట్టాడు. దీంతో సొంత జట్టు కొలంబియా ఇంటిదారి పట్టింది. కొద్ది రోజుల్లోనే అతడిని కాల్చి చంపారు కొందరు. ఆ కొందరు ఎవరంటే డ్రగ్స్ వ్యాపారులు.

ఈ రెండు ఉదాహరణలు చాలు దక్షిణ అమెరికా ఖండంలో డ్రగ్స్ దందా ఏ స్థాయిలో ఉంటుందో చెప్పేందుకు. కొలంబియా, మెక్సికో మరీ ముఖ్యంగా డ్రగ్స్ కు పెట్టిందిపేరు.

అత్యంత హింసాత్మక ప్రదేశంలో

మెక్సికోని సినాలోవా కార్టెల్‌.. దీనికి ప్రపంచంలోనే అత్యంత క్రైం రేట్ ఉండే ప్రాంతంగా చెబుతారు. అంతగా హింస చెలరేగుతుంటుంది. ఇక్కడ డ్రగ్స్ ముఠాల మధ్య కొంతకాలంగా తీవ్ర ఘర్షణలు జరుగుతున్నాయి. మెక్సికో సినాలోవా రాష్ట్రంలో జరుగుతోన్న ఈ గ్యాంగ్‌ వార్‌లో 53 మంది చనిపోగా.. 51 మంది ఆచూకీ లేరు. జూలై నెలలో డ్రగ్‌ డాన్‌ ఇస్మాన్‌ ఎల్‌మాయో జంబాడా అరెస్టుతో ఘర్షణలు చెలరేగాయి. వీటిని ఇప్పటికీ కట్టడి చేయలేకపోతున్నారు. అయితే, కార్టెల్‌ కు చెందిన మరో గ్రూప్ సీనియర్ సభ్యుడు తనను కిడ్నాప్‌ చేసి అమెరికా తీసుకెళ్లాడనేది జంబాడా ఆరోపణ.

డ్రగ్ లార్డ్...

ఇస్మాయిల్‌ ‘ఎల్‌ మాయో’ జంబాడా మెక్సికన్‌ డ్రగ్‌ లార్డ్‌. 2017లో జోక్విన్‌ ఎల్‌ చాపోతో కలిసి సినాలోవా కార్టెల్‌ స్థాపించాడు. ఎల్‌ చాపో పోలీసులకు దొరకగా.. అతడి నలుగురు కుమారులు ట్రాఫికింగ్‌ మాఫియాలో చిక్కారు. ‘లాస్‌ చాపిటోస్‌’ లేదా లిటిల్‌ చాపిటోస్‌ గా పిలిచే వీరు అమెరికాకు పెంటానికల్‌ డ్రగ్‌ ను భారీగా ఎగుమతి చేస్తుంటారు. ఇప్పుడు తనను కిడ్నాప్ చేసింది లాస్‌ చాపిటోస్‌ సభ్యుడేనని మాయో అంటున్నాడు. ఎల్ మాయో జూలైలో అమెరికాలో అరెస్టయ్యాడు. ఇదే అదనపుగా అతడి గ్రూప్ లో ఘర్షణలు జరుగుతున్నాయి. 40 మందిని అరెస్టు చేసినా అవి ఆగడం లేదు.

ఫేమస్ తెలుగు ట్రావెలర్ మెక్సికోలోనే..

ఆటగాడు.. ఆటగాడు అంటూ తనదైన శైలి యాసతో తెలుగువారిలో విశేషమైన ఫాలోయింగ్ తెచ్చుకున్న యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ ప్రస్తుతం మెక్సికోలోనే ఉన్నాడు. గత 10 రోజులుగా ఆయన అక్కడే పర్యటిస్తున్నాడు. టులుమ్ అనే ప్రాంతంలో పర్యటన సాగిస్తున్నారు. మెక్సికో లోని కాన్ కూన్ నుంచి టులుమ్ కు వెళ్లారు. కాగా, రెండేళ్ల కిందట గల్ఫ్ దేశాల్లో అన్వేష్ టూర్ చేస్తుండగా భూకంపం వచ్చింది. దాన్నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు.

Tags:    

Similar News