తానా ఫండ్ పూలింగ్ చేస్తుందా...?
తానా అంటే తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా. దశాబ్దాలుగా తానా నార్త్ అమెరికాలో పనిచేస్తోంది
తానా అంటే తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా. దశాబ్దాలుగా తానా నార్త్ అమెరికాలో పనిచేస్తోంది. అక్కడ తెలుగు వారితో కనెక్ట్ అవుతూ చాలా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఒక విధంగా చెప్పాలీ అంటే అమెరికాలో తెలుగు వారికి సంబంధించి అతి పెద్ద ఆర్గనైజేషన్ గా తానా ఉంది.
తానా తెలుగుదేశం పార్టీ కోసం పని చేయడానికి సిద్ధం అవుతోందా అన్న చర్చ కూడా ముందుకు వస్తోంది. తానాలో చాలా మంది ప్రముఖులు ఉన్నారు. అమెరికాలో వెల్ సెటిల్ అయిన వారూ ఉన్నారు. అంగబలం అర్ధబలంలో ధీటైన వారు అక్కడ ఉన్నారు.
దాంతో టీడీపీకి సానుభూతిగా సంఘీభావంగా తానా ఇక మీదట తన వంతుగా ఎంతో కొంత సాయపడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చంద్రబాబు టీడీపీకి పెద్ద దిక్కుగా ఉండే నేత. అలాంటి ఆయన జైలు లో ప్రస్తుతం ఉన్నారు. ఆయన మరిన్నాళ్ళు జైలులోనే ఉంటే మాత్రం టీడీపీకి అన్ని విధాలుగా ఇబ్బంది వస్తుంది అని అంటున్నారు.
ముఖ్యంగా నిధుల సమీకరణ విషయంలో బాబు ఉంటే ఆ కధే వేరుగా ఉంటుంది. ఆయనకు ఉన్న పలుకుబడితో టీడీపీకి ఆర్ధిక కష్టాలు ఎపుడూ రాలేదు, బాబు కరెక్ట్ టైం లో జైలులో ఉన్నారు. మరి కొద్ది నెలలలో ఎన్నికలు ఏపీలో జరగనున్నాయి. ఇప్పటి నుంచే అంతా సర్దుకోవాల్సి ఉంది.
అయితే చంద్రబాబు మాత్రం జైలులోనే మరికొంతకాలం ఉంటే అపుడు పరిస్థితి ఏంటి అన్న చర్చ కూడా ముందుకు వస్తోంది. అపుడు కచ్చితంగా టీడీపీకి నిధుల సమస్య ఏర్పడుతుంది అని అంటున్నారు. ఈ కష్టకాలంలో టీడీపీని ఆదుకునేందుకు తానా ముందుకు వస్తోంది అని ప్రచారం అయితే జోరుగా సగుతోంది.
ఎన్నారైలు అంతా కలసి టీడీపీకి ఫండ్ కలెక్ట్ చేసి పెట్టేందుకు సిద్ధపడుతున్నారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో హోరాహోరీ పోరు ఏపీలో సాగనుంది. వైసీపీ అధికారంలో ఉంది. దాంతో ఆ పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదు. నిధుల విషయంలో ధీమాగా ఉండవచ్చు.
కానీ టీడీపీ విషయంలో అలా కాదు, ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉంటూ నాలుగేళ్లుగా అనేక ఇబ్బందులను పడుతోంది. వైసీపీ పాలనలో టీడీపీ సానుభూతిపరులు కూడా బాహాటంగా బయటకు వచ్చే పరిస్థితి లేదు అని అంటున్నారు. అన్ని విధాలుగా టీడీపీని కట్టడి చేయడానికి వైసీపీ ఎటూ చూస్తుంది అని అంటున్నారు. దానికి తోడు అన్నట్లుగా ఇపుడు చంద్రబాబు అరెస్ట్ ద్వారా టీడీపీని మరింత సమస్యలలో నెట్టేందుకు ప్రయత్నం జరిగింది అంటున్నారు.
దాంతో ఈ కీలక సమయంలో తానున్నాను అని తానా ముందుకు వస్తోందా అన్నదే చర్చగా ఉంది. దీని మీద అపుడే ఎన్నారైల మధ్య చర్చలు మొదలయ్యాయని అంటున్నారు ఈ ప్రచారం కనుక నిజం అయితే టీడీపీకి కొండంత ఊరట దక్కినట్లే అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరగనుందో.