సివిల్స్ లో మన సత్తా.. తెలుగమ్మాయి ర్యాంకు ఎంతంటే?

మహబూబ్ నగర్ కు చెందిన అనన్య రెడ్డి జాతీయ స్థాయిలో మూడ ర్యాంకు సాధించడం విశేషం.

Update: 2024-04-16 11:49 GMT

అఖిల భారత సర్వీసు నియామకాల్లో తెలుగు వారు మెరిశారు. సివిల్స్ 2023 ఫలితాల్లో మంచి మార్కులు సాధించి ముందు స్థానంలో నిలిచారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు తమ సత్తా చాటారు. మహబూబ్ నగర్ కు చెందిన అనన్య రెడ్డి జాతీయ స్థాయిలో మూడ ర్యాంకు సాధించడం విశేషం. దీంతో మన తెలుగువారి ఖ్యాతి ఇనుమడించింది.

ఆదిత్య శ్రీవాస్తవ తొలి ర్యాంకు సాధించగా అనిమేష్ ప్రధాన్ రెండో ర్యాంకు, దోనూరు అనన్య రెడ్డి మూడో ర్యాంకు, పీకే సిద్ధార్థ్ రామ్ కుమార్ నాలుగు, రుహాని ఐదు, స్రుష్టి దభాన్ ఆరు, అన్ మోల్ రాఠోర్ ఏడు, ఆశిష్ కుమార్ ఎనిమిది, నౌషీద్ తొమ్మిది, ఐశ్వర్యం ప్రజాపతి పదో ర్యాంకుల్లో నిలిచారు. గత ఏడాది సివిల్స్ లో కూడా తెలుగు అమ్మాయి ఉమాహారతి మూడో ర్యాంకులో మెరవడం గమనార్హం.

డోనూరు అనన్య రెడ్డి (3) మూడో ర్యాంకులో సత్తా చాటింది. నందల సాయికిరణ్ 27, మెరుగు కౌశిక్ 82, పెంకీసు ధీరజ్ రెడ్డి 173, జి. అక్షయ్ దీపక్ 196, గణేశ్న భాను శ్రీ లక్ష్మీ అన్నపూర్ణ 198, నిమ్మనపల్లి ప్రదీప్ రెడ్డి 382, బన్న వెంకటేష్ 467, కడుమూరి హరిప్రసాద్ రాజు 475, పూల ధనుష్ 480, కె.శ్రీనివాసులు 526, నెల్లూరు సాయితేజ 558, కిరణ్ సాయింపు 568, మర్రిపాటి నాగభరత్ 580, పోతుపురెడ్డి భార్గవ్ 590, కె.అర్పిత 639, ఐశ్వర్య నెల్లి శ్యామల 649, సాక్షి కుమారి 679, చౌహాన్ రాజ్ కుమార్ 703, గాదె శ్వేత 711, వి. ధనుంజయ్ కుమార్ 810, లక్ష్మీ బానోతు 828, ఆదా సందీప్ కుమార్ 830, జె రాహుల్ 873, హనిత వేములపాటి 887, కె.శశికాంత్ 891, కెసారపు మీన 899, సాయి అలేఖ్య 938, గోవద నవ్యశ్రీ 995 నిలిచారు.

కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖల్లో 1105 మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో గత ఏడాది మే 28న ప్రిలిమ్స్ నిర్వహించింది. సెప్టెంబర్ 15,16,17,23,24 తేదీల్లో మెయిన్స్ పరీక్షలు జరిపింది. డిసెంబర్ 8న మెయిన్స్ ఫలితాలు విడుదల చేసింది. మెయిన్స్ లో సత్తా చాటిన వారికి జనవరి 2, ఏప్రిల్ 9 మధ్య ఇంటర్వ్యూలు నిర్వహించి ఫలితాలు ప్రకటించింది. ఇందులో 1016 మందిని ఎంపిక చేయగా జనరల్ కేటగిరీలో 347, ఈ డబ్ల్యూఎస్ నుంచి 115, ఓబీసీ నుంచి 303, ఎస్సీ 165, ఎస్టీ 86 మందిని ఎంపిక చేసింది.

Tags:    

Similar News