రోజుకు రూ.28 వేల జీతంతో టెస్లా జాబ్ ఆఫర్.. ఏం చేయాలో తెలుసా?

ప్రపంచంలో ఎలక్ట్రికల్ కార్లకు సంబంధించి అత్యాధునిక ఫీచర్లు ఉన్న కార్లలో మొదటి స్థానం టెస్లా.

Update: 2024-08-21 04:30 GMT

ప్రపంచంలో ఎలక్ట్రికల్ కార్లకు సంబంధించి అత్యాధునిక ఫీచర్లు ఉన్న కార్లలో మొదటి స్థానం టెస్లా. ఎలాన్ మాస్క్ ను ప్రపంచ కుబేరుడిగా మార్చటంలో టెస్లా కీలక భూమిక పోషించటం తెలిసిందే. అలాంటి టెస్లా.. తాజాగా తన కెరీర్ పేజీలో సరికొత్త ఉద్యోగ అవకాశాల్ని ప్రకటించింది. ఈ ఉద్యోగం ఏమిటన్నది తర్వాత.. జీతం రోజుకు రూ.28వేలు కావటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రోజులో ఏడు గంటలు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. ఏడు గంటల పాటు నడవటం.. టెక్నాలజీని వినియోగించే మక్కువ ఉంటే ఈ జాబ్ కు సరిపోతుందంటున్నారు. గంటకు 48 డాలర్లు చొప్పున అంటే.. దగ్గర దగ్గర మన రూపాయిల్లో నాలుగు వేల రూపాయిలు. అలా రోజుకు రూ.28 వేలు సంపాదించే వీలున్న ఈ జాబ్ ఇప్పుడు ఊరిస్తోంది. ఇంతకూ ఈ జాబ్ కు ఏమేం అర్హతలు ఉండాలి? అన్న విషయంలోకి వెళితే.. ఆసక్తికర అంశాలు తెలుస్తాయి.

టెస్లా ఇప్పుడు ఆప్టిమస్ పేరుతో రోబోల్ని తయారు చేస్తోంది. దీనికి శిక్షణ ఇవ్వటమే జాబ్. అర్థం కాలేదా? మరింత వివరంగా చెబుతాం చదవండి. ఈ రోబోను తయారు చేసే క్రమంలో వివిధ రంగాల్లో నైపుణ్యం ఉన్న వారిని రిక్రూట్ చేసుకోవటంతో పాటు.. అత్యాధునిక మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగిస్తూ ఆప్టిమస్ కు ట్రైనింగ్ ఇవ్వటానికి అవసరమైన ఉద్యోగులు కావాలని టెస్లా పేర్కొంది. డేటా కలెక్షన్ ఆపరేటర్ గా ఉద్యోగ టైటిల్ ను టెస్లా పేర్కొంది.

జాబ్ లో పనేమంటే.. మోషన్ క్యాప్చర్ సూట్.. వర్చువల్ రియాలిటీ హెడ్ సెట్ ను ధరించాల్సి ఉంటుంది. అక్కడి మాడ్యుల్ కు తగ్గట్లు పని చేయాల్సి ఉంటుంది. అలా రోజుకు ఏడు గంటలు పని చేయాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా సమాచారాన్ని సేకరించటం.. దాన్ని విశ్లేషించటంతో పాటు నివేదికల్ని రాయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని ఎలక్ట్ట్రానిక్ గ్యాడ్జెట్లు వినియోగించాల్సి ఉంటుంది. అయితే.. ఈ జాబ్ కు అప్లై చేసే వారు కనీసం 5 అడుగుల 7 అంగుళాల నుంచి 5‘‘11’’ మధ్య హైట్ ఉండాలి. పదమూడు కేజీల బరువున్న సూట్ ను ధరించే సామర్థ్యం ఉండాలి.

ఇక.. జీతం విషయానికి వస్తే కనిష్ఠంగా 25.25 డాలర్లు మొదలు కొని గరిష్ఠంగా 48 డాలర్ల మధ్య ఉంటుంది. అనుభవం.. నైపుణ్యంతో చేసే పనికి తగ్గట్లు ప్యాకేజీ మారుతుంటుంది. ఇవే కాకుండా.. అన్ని రకాల వసతుల్ని.. ప్రోత్సహాల్ని ఇస్తారు. షిఫ్టు సిస్టం కూడా ఉండే ఈ జాబ్ కు సంబంధించిన మరిన్ని వివరాలు కెరీర్ పేజీలో ఉన్నాయి. ఇంతకూ ఈ జాబ్ ఎక్కడ చేయాలంటారా? అమెరికాలోని కాలిఫోర్నియాలో పని చేయాల్సి ఉంటుంది. జీతం చూసినంతనే టెంప్టు కావొచ్చు. కానీ.. పని సరికొత్తగానే కాదు.. కాస్తంత కష్టంగానే ఉందన్న మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News