అధ్యక్ష్యా.. ఇప్పటి వరకు అంతా బాగుంది!
అలానే చంద్రబాబు, పవన్ ఇలా.. అందరూ ప్రమాణ స్వీకారం చేశారు.
ఏపీలో అసెంబ్లీ సమావేశమైంది. శుక్రవారం, శనివారం రెండు రోజులు కూడా.. సభ జరుగుతుంది. ఈ నేప థ్యంలో 174 మంది అభ్యర్థులతో ప్రొటెం(తాత్కాలిక) స్పీకర్ ప్రమాణం చేయిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కొన్ని మెరుపులు స్పష్టంగా కనిపించాయి. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ అధినేత , మాజీ సీఎం జగన్ వస్తారో రారో.. అని అనుకున్నారు. కానీ, ఆయన వచ్చారు. జగన్ అనే నేను! అని ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అలానే చంద్రబాబు, పవన్ ఇలా.. అందరూ ప్రమాణ స్వీకారం చేశారు.
ఇక, వైసీపీ సభ్యులు కూడా.. సభకు వచ్చారు. ప్రాధాన్యం ప్రకారం వారి పేరులోని తొలి అక్షర క్రమాన్ని బట్టి.. సభ్యులతో అసెంబ్లీ సచివాలయ అధికారులు ప్రమాణానికి ఆహ్వానించారు. దీంతో వారు ప్రొటెం స్పీకర్ కు నమస్కరిస్తూ.. ప్రమాణం చేశారు. మొత్తానికి అందరూ.. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముని గిపోయారు. పవన్ కల్యాణ్ ప్రమాణం చేసినప్పుడు సభ్యులు అందరూ గౌరవంగా నిలబడి మళ్లీ కూర్చున్నారు. జగన్ ప్రమాణ స్వీకారం చేసి.. సభ్యులకు నమస్కరిస్తూ.. ప్రొటెం స్పీకర్‌ను కలుసుకున్నారు.
అయితే.. ఈ సమయంలో వైసీపీ సభ్యులు సభలో ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనంతరం.. ప్రొటెం స్పీకర్.. వద్దకు వెళ్లి అభినందించారు. మొత్తానికి తొలి రోజు అసెంబ్లీ బాగానే సాగిపోయింది. ఎవరూ ఎక్కడా.. రెచ్చగొట్టింది లేదు. ఎవరూ గిల్లి కజ్జాలకు వెళ్లింది లేదు. అయితే. సాధ్యమైనంత వరకు శుక్రవారమే కార్యక్రమం ముగియనుంది., శనివారం స్పీకర్ , ఉప స్పీకర్ ఎన్నిక జరగనుంది. అనంతరం.. సభ నిరవధికంగా వాయిదా పడుతుంది.