ఫ్లైట్ టిక్కెట్స్ బుక్ చేస్తున్నారా?... బెస్ట్ & వరస్ట్ ఎయిర్ లైన్స్ ఇవే!

వీటి కింద కామెంట్ సెక్షన్ లో చాలా మంది వారి వారి అనుభవాలనూ పంచుకుంటుంటారు.

Update: 2024-12-04 22:30 GMT

ఇటీవల కాలంలో విమాన ప్రయాణికులు వారు ప్రయాణిస్తున్న విమానాల్లో కలిగిన సౌకర్యాలను ఆన్ లైన్ వేదికగా ప్రపంచంతో పంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విమానంలో దారుణ పరిస్థితులు, అసౌకర్యాలపై వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో.. అవి వైరల్ గా మారుతున్నాయి.

వీటి కింద కామెంట్ సెక్షన్ లో చాలా మంది వారి వారి అనుభవాలనూ పంచుకుంటుంటారు. వీటిలో కొన్నింటికి సదరు విమానయాన సంస్థలు స్పందిస్తుండగా.. మరికొన్ని మాత్రం చూసీ చూడనట్లుగా ఉంటున్నాయనే కామెంట్లు సొంతం చేసుకుంటున్నాయి. ఈ సమయంలో తాజాగా ప్రపంచంలోనే బెస్ట్ & వరస్ట్ ఎయిర్స్ లైన్స్ లిస్ట్ తెరపైకి వచ్చింది.

అవును... విమానాల్లో ప్రయాణించేటప్పుడు ఏ విమానయాన సంస్థ ఫ్లైట్లు బెటర్ గా ఉంటాయి.. వేటిలో నాణ్యమైన సౌకర్యాలు ఉంటాయి.. వేటిలో సౌకర్యవంతమైన సేవలు ఉంటాయి అనే విషయాలను పరిగణలోకి తీసుకుని మరీ టిక్కెట్లు బుక్ చేసుకోవాలని చెబుతుంటారు. తర్వాత బాద పడినా ప్రయోజనం ఉండదని అంటారు.

ఈ క్రమంలో... పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నట్లుగా ఉండే కొన్ని విమానాల్లో.. ఏదో ఊహించుకుని టిక్కెట్స్ బుక్ చేసుకున్న తర్వాత నరకం చూసిన సందర్భాలూ చాలానే ఉంటుంటాయి. ఇలాంటి ఫిర్యాదులకు నెట్టింట కొదవ లేదు. ఈ సమయంలో... గ్లోబల్ ఎయిర్ లైన్స్ ఇండస్ట్రీ అంతర్జాతీయ విమానయాన సంస్థలకు ర్యాంకులు విడుదల చేసింది.

ప్రయాణికుల ఫీడ్ బ్యాక్, కార్యాచరణ సామర్థ్యం ఆధారంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విమానయాన సంస్థలో ఏవి ఉత్తమమైనవి, మరేవి చెత్త సర్వీసు అందిస్తున్నాయనే జాబితాను విడుదల చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకూ గల డేటాను బేస్ చేసుకుని ఈ ర్యాంకులు ఇచ్చింది.

దీనిపై స్పందించిన ఎయిర్ హెల్ప్ సీఈవో టామ్జ్ పౌల్జిన్.. ఈ ర్యాంకులు కేటాయించేది, ప్రకటించేది కేవలం ప్రయాణికుల అభిప్రాయానికి ప్రాధాన్యత ఇచ్చేలా ఎయిర్ లైన్స్ ని ప్రోత్సహించడానికే అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తమ, చెత్త టాప్ 10 ఎయిర్స్ లైన్స్ వివరాలను ఇప్పుడు చూద్దాం...!

2024లో వరస్ట్ ఎయిర్స్ లైన్స్.. వాటి ర్యాంకులు!:

109. తునిసైర్

108. బజ్

107. నౌవెలైర్

106. బల్గేరియా ఎయిర్

105. ఎల్.ఎల్. ఇజ్రాయెల్ ఎయిర్ లైన్స్

104. పెగాసస్ ఎయిర్ లైన్స్

103. ఇండిగో

102. తారోమ్

101. ఎయిర్ మారిషస్

100. స్కై ఎక్స్ ప్రెస్

2024లో బెస్ట్ ఎయిర్స్ లైన్స్.. వాటి ర్యాంకులు!:

1. బ్రస్సెల్ ఎయిర్ లైన్స్

2. ఖతార్ ఎయిర్ వేస్

3. యునైటెడ్ ఎయిర్ లైన్స్

4. అమెరికన్ ఎయిర్ లైన్స్

5. ప్లే (ఐస్లాండ్)

6. ఆస్ట్రియన్ ఎయిర్ లైన్స్

7. లాట్ పోలీష్ ఎయిర్ లైన్స్

8. ఎయిర్ అరేబియా

9. వైడెరో

10. ఎయిర్ సెర్బియా

Tags:    

Similar News