జగన్ వీడియో ట్రోలింగే ట్రోలింగ్!

అటువంటి ఆయన తన పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డిని సమర్థిస్తూ రావడం దానికి ఆయన చెప్పిన రీజన్స్ అన్నీ కూడా సోషల మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ అవుతున్నాయి.

Update: 2024-07-05 03:06 GMT

జగన్ ఒక మాజీ ముఖ్యమంత్రి. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నారు. అటువంటి ఆయన తన పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డిని సమర్థిస్తూ రావడం దానికి ఆయన చెప్పిన రీజన్స్ అన్నీ కూడా సోషల మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ అవుతున్నాయి.

జగన్ తన పార్టీకి చెందిన వారు కాబట్టి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని పరామర్శించవచ్చు. ఆ తరువాత ఆయన మీడియాతో మాట్లాడిన మాటలే నెటిజన్ల ట్రోల్స్ కి గురి అవుతున్నాయి. ఇంతకీ జగన్ ఏమన్నారు అంటే నిజమే, మా ఎమ్మెల్యే ఈవీఎంలు ధ్వంసం చేశారు. అందుకు చేశారు అంటే తనకు అనుకూలంగా పోలింగ్ జరగలేదు అని భావించబట్టే అని అంటున్నారు.

అంతే కాదు పిన్నెల్లి పోలింగ్ బూత్ లోకి వెళ్ళి సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేశారు. నిజంగా పోలింగ్ లో అక్రమాలు జరిగితే అక్కడ ఉన్న అధికారులకు పోలింగ్ సిబ్బందికి చెబుతారా లేక చట్టాన్ని చేతులలోకి తీసుకుని పిన్నెల్లి ఈవీఎంలను ధ్వంసం చేస్తారా అన్నది నెటిజన్ల ప్రశ్న. పిన్నెల్లి చేసినది తప్పు. అది ఎన్నికలలో చేసిన పెద్ద నేరం.

అలాంటి పిన్నెల్లిని సమర్ధిస్తూ జగన్ మాట్లాడడమే కాకుండా ఆయన మీద తప్పుడు కేసులు బనాయించారు అని టీడీపీ కూటమి ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు. అంటే పిన్నెల్లి అయినా ఏ అభ్యర్థి అయినా తనకు అనుకూలంగా పోలింగ్ జరగపోతే ఈవీఎంలను విధ్వంసం చేయవచ్చు అని జగన్ చెప్పారా అలా చేయడం తప్పు కాదు అని ఆయన అంటున్నారా అన్నదే ప్రశ్న.

ఈ రకంగా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడంతో వైసీపీ నేతలే ఖంగు తిన్న పరిస్థితి ఉంది అని అంటున్నారు. ఆయన పిన్నెల్లిని పరామర్శించి దీని మీద న్యాయ పోరాటం చేస్తామని చెప్పి ఊరుకుంటే పోయేదానికి ఇంకా విడమరచి పిన్నెల్లి ఘాతుకాన్ని సమర్ధిస్తూ మాట్లాడడంతో ట్రోలింగ్ ఆఫ్ ది డేగా జగన్ మారారు అని అంటున్నారు

జగన్ ఎన్నికల్లో ఓటమి తరువాత తొలిసారి మీడియాను ఫేస్ చేశారు. అయితే ఆయన మీడియాతో మాట్లాడిన మాటలు కానీ ఆయన సమర్ధింపులు కానీ పార్టీకి బూస్టింగ్ ఇవ్వకపోతే ట్రోలింగ్ గా మారడంతో వైసీపీలోనే తట్టుకోలేకపోతున్నారు.

అంతే కాదు ఈవీఎంను ధ్వంసం చేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన తన పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేను సమర్థించినందుకు గానూ జగన్ ని టీడీపీ కూటని నేతలు తప్పు పడుతున్నారు. అంతే కాదు ఒక ఆట ఆడుకుంటున్నరు. మొత్తం మీద జగన్ మాట్లాడిన వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాదు ట్రోలింగ్ కి పెద్ద ఎత్తున గురి అవుతూ రికార్డులు బద్ధలు కొడుతోంది అని అంటున్నారు.


Full View


Tags:    

Similar News