స్వీట్ బాక్సు ఇచ్చి మొండి బకాయిల్ని వసూలు చేస్తారట

తమ ప్రతి శాఖకు పది స్వీట్ బాక్సులు పంపాలని నిర్ణయించింది. ఈ పది స్వీట్ బాక్సుల్ని.. సదరు బ్రాంచ్ లోని టాప్ 10 డిఫాల్టర్లకు ఇవ్వాలన్నది ఆలోచనగా చెబుతున్నారు.

Update: 2023-11-03 04:07 GMT

చిన్న మొత్తాలకే సామాన్యులకు చుక్కలు చూపించే బ్యాంకులు.. బడా బాబుల విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తుంటారు. సామాన్యల విషయంలో కరాఖండిగా వ్యవహరిస్తూ.. మరీ ఇంత దారుణమా? అన్న భావన గురిచేసే బ్యాంకులు.. వందల కోట్లు బాకీ ఉన్నప్పటికీ.. బడా సంస్థల విషయంలో బ్యాంకులు ప్రదర్శించే తీరు భిన్నంగా ఉంటుంది. అయితే.. గతానికి భిన్నంగా ఇప్పుడు మొండి బకాయిల మీద కొన్ని బ్యాంకులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి.

తాజాగా అలాంటి ప్లాన్ ను సిద్ధం చేసింది ప్రభుత్వ రంగ యూకో బ్యాంక్. తమ ప్రతి శాఖకు పది స్వీట్ బాక్సులు పంపాలని నిర్ణయించింది. ఈ పది స్వీట్ బాక్సుల్ని.. సదరు బ్రాంచ్ లోని టాప్ 10 డిఫాల్టర్లకు ఇవ్వాలన్నది ఆలోచనగా చెబుతున్నారు. పండుగ వేళలో.. టాప్ 10 మొండి బకాయిలు ఉన్న వారికి.. స్వీట్ బాక్సులు ఇవ్వటం ద్వారా సరికొత్త గాంధీగిరిని చేపట్టాలని నిర్ణయించింది.

ప్రస్తుతం మొండి బకాయిదారే అయి ఉండొచ్చు కానీ.. గతంలో సదరు కస్టమర్ తమకు విలువైన కస్టమర్ గా భావిస్తున్నట్లు బ్యాంక్ చెబుతోంది. అందుకే.. మొండిబకాయిదారులను సైతం మర్యాదగా.. స్వీట్ బాక్సు చేతిలో పెట్టి.. తమ అప్పు తీర్చాల్సిందిగా కోరుతామని చెబుతున్నారు. మరి.. ఈ స్వీట్ బాక్సు స్ట్రాటజీ ఎంత మేర వర్కువుట్ అవుతుందో దీపావళి అయితే కానీ క్లారిటీ రాదంటున్నారు. మరి.. యూకో బ్యాంకును ఇతర బ్యాంకులు ఫాలో అవుతాయా? లేదా? అన్నది చూడాలి.

Tags:    

Similar News