నేటి నుంచి ఏపీలో `ఆ రెండు`.. వైసీపీకి ప్లస్సేనా..?
ఈ రెండు కూడా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ ప్రారంభి స్తున్నకార్యక్రమాలు కావడం గమనార్హం.
ఏపీలో బుధవారం నుంచి రెండు కీలక కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. వీటిపై అధికార పార్టీ వైసీపీ భారీగానే ఆశలు పెట్టుకుంది. వీటిలో ఒకటి బుధవారం నుంచి ప్రారంభం కానున్న బీసీ గణన. రెండోది మరోవిడత సామాజిక సాధికార యాత్ర. ఈ రెండు కూడా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ ప్రారంభి స్తున్నకార్యక్రమాలు కావడం గమనార్హం. వాస్తవానికి ఇప్పటికే సామాజిక సాధికార యాత్ర తొలిదశ ఈ నెల 9తో ముగిసింది.
తొలి దశ సామాజి యాత్రలో ఆశించిన ఫలితం లభించలేదు. ఎక్కడికక్కడ పార్టీలో అంతర్గత విభేదాలు ఈ యాత్రలపై భారీ ఎత్తున ప్రభావం చూపించాయి. అంతేకాదు.. నాయకులు లేక అనే సభలు వెలవెల బోయాయి. డ్వాక్రా మహిళలు, అంగన్ వాడీ సిబ్బందితోనే సభలను నిర్వహించారు. మరీ ముఖ్యంగా క్షేత్రస్తాయిలో ప్రజల సమస్యలను, ప్రభుత్వ పథకాలను వివరించాల్సిన ఈ ప్రచార యాత్రలు.. ఏకపక్షంగా మారాయి.
ఇదేసమయంలో చంద్రబాబు అరెస్టు, దీనిపై వైసీపీకి వచ్చిన వ్యతిరేకత వంటివి ప్రధానంగా యాత్రల ను ప్రభావితం చేశాయి. దీంతో చంద్రబాబు గురించి వివరణ ఇచ్చుకునేందుకే సామాజిక సాధికార యా త్రలు పరిమితం అయ్యాయి. దీంతో రెండో దశ ప్రారంభం కానున్న బుధవారం నుంచి ఈ కార్యక్రమా న్నిమరింత దగ్గరగా మానిటరింగ్ చేయాలని వైసీపీ నిర్ణయించింది. ఈ యాత్రలకు విధిగా రావాల్సిందే నని వైసీపీ కేడర్‌కు సైతం దిశానిర్దేశం చేసింది. దీంతో ఈ రెండో దశ యాత్రలు ఏమేరకు సక్సెస్ అవుతా యనేది చర్చనీయాంశంగా మారింది.
ఇక, 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ వేస్తున్న మరో కీలక అడుగు.. బీసీ కుల గణన. ఇది కూడా బుధవారం నుంచే ప్రారంభం కానుంది. రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఈ డిమాండ్ ఉంది. బీసీల్లో ఏబీసీడీ వర్గాల్లోనే మరింత వెనుకబడిన వర్గాలు ఉన్నాయని, వీటిని వెలికి తీసి సంక్షేమాన్ని, రిజర్వేషన్లను అందించాలనే డిమాండ్ కొన్నిదశాబ్దాలుగా వినిపిస్తున్నదే.
దీనిపై తాజాగా దృష్టి పెట్టిన జగన్ బీసీ కుల గణనకు తెరదీశారు. ఈ కార్యక్రమం ద్వారా 139 ఉపకులాల ఆర్థిక పరిస్థితి, విద్యాపరిస్థితి, కుటుంబాల జీవన విధానం వంటి కీలక అంశాలను అధ్యయనం చేయనున్నారు. దీనికి అనుగుణంగా వచ్చే ఎన్నికల్లో మేనిఫెస్టోను రూపొందించాలని వైసీపీ భావిస్తున్నట్టు తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి.