ఆ ఓట్లు 42 ల‌క్ష‌లు.. వైసీపీకేనా...?

ఈ క్ర‌మంలో రాష్ట్ర వ్యాప్తంగా 42 ల‌క్ష‌ల‌కు పైగా ఉన్న ఓటు బ్యాంకును త‌న‌వైపు తిప్పుకొనేందుకు చ‌క్క‌టి వ్యూహాన్ని రాత్రికి రాత్రి అమ‌లు చేసింది వైసీపీ ప్ర‌భుత్వం.

Update: 2023-11-13 23:30 GMT

ఏపీలో ఎన్నిక‌ల స‌మ‌యం వ‌చ్చేసింది. దీంతో అధికార వైసీపీ, ప్ర‌తిప‌క్ష టీడీపీలు దూకుడుగా ఉన్నాయి. ప్ర‌తిప‌క్షం ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది. అయితే.. ఒక‌వైపు ప్ర‌భుత్వ సానుకూల‌త‌ను ప్ర‌చారం చేసుకుంటూనే.. మ‌రోవైపు.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను మ‌రింత దూకుడుగా ప‌రిష్క‌రిస్తూ.. ఓటు బ్యాంకునుత‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు వైసీపీ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది.

ఈ క్ర‌మంలో రాష్ట్ర వ్యాప్తంగా 42 ల‌క్ష‌ల‌కు పైగా ఉన్న ఓటు బ్యాంకును త‌న‌వైపు తిప్పుకొనేందుకు చ‌క్క‌టి వ్యూహాన్ని రాత్రికి రాత్రి అమ‌లు చేసింది వైసీపీ ప్ర‌భుత్వం. అదే.. బీసీల్లో ఉప కులాలుగా ఉన్న కొన్నింటికి.. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ హోదా ఇస్తూ.. సంచ‌ల‌న నిర్ణ‌యించింది. దాదాపు 21 బీసీ ఉప‌కులాల‌కు రాష్ట్ర వ్యాప్తంగాబీసీ హోదా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అంటే.. వారు ఆయా ప్రాంతాల్లోనే ప‌రిమితం అవుతున్నారు. ఇలాంటివారికి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ హోదా, రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తూ.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.

ప‌లితంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఆయా ప్రాంతాల‌కే ప‌ర‌మితంగా రిజ‌ర్వేష‌న్ పొందుతున్న‌21 బీసీ ఉప కులాలు ఇక నుంచి విద్య‌, ఉద్యోగాలు త‌దిత‌ర అంశాల్లో రాష్ట్ర వ్యాప్తంగా రిజ‌ర్వేష‌న్ పొంద‌నున్నాయి. కొన్ని ద‌శాబ్దాలుగా ఉన్న ఈ స‌మ‌స్య‌ను ఉరుములు మెరుపులు లేకుండా ప్ర‌భుత్వం ప‌రిష్క‌రించ‌డం వెనుక ఓటు బ్యాంకు రాజ‌కీయాలేఉన్నాయ‌ని ప్ర‌తిప‌క్ష నాయ‌కులు చెబుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం జ‌గ‌న్‌స‌ర్కారు త‌పిస్తున్న నేప‌థ్యంలో బీసీల‌కు మేలు జ‌రిగింద‌ని మ‌రికొంద‌రు అంటున్నారు.

ఇవీ.. ఉప కులాలు

కురుకుల‌

పాండ‌ర‌

సామంతుల‌

పాల ఏక‌రి

ఏకుల‌

వ్యాకిల‌

ఏకిరి

న‌య‌నివారు

పాలేగారు

తొల‌గ‌రి

క‌వ‌లి

ఆసాదుల‌

కెవుట‌

అచ్చుక‌ట్ల‌వాండ్లు

క‌లాలీ

గౌండ్ల

శెట్టిబ‌లిజ‌

కుంచిటి

వ‌క్క‌లింగ‌

గుడ్ల‌

మున్నూరు కాపు

పొలినాటి వెల‌మ‌

స‌ద‌ర‌

అర‌వ‌

అయ్య‌క‌ర‌

న‌గ‌రాలు

ముద‌ర‌ల్‌

ముదిలియ‌ర్‌

బెరివైశ్య‌

అతిరాస

కుర్మి

క‌లింగ వైశ్య‌

Tags:    

Similar News