టిక్ టాక్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఇదే కారణం!

వాస్తవానికి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ యాప్ కొనుగోలుపై చర్చ జరిగే అవకాశం ఉందనే చర్చ ఇటీవల తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.

Update: 2025-02-14 21:30 GMT

టిక్ టాక్ యాప్ కు ఫ్యాన్స్ విపరీతంగా ఉంటారని అంటారు. ఈ యాప్ వచ్చిన కొత్తలో భారత్ లోనూ హల్ చల్ చేసినా.. తర్వాత కాలంలో కొన్ని భద్రతా కారణాల కారణంగా మూగబోయిన పరిస్థితి. ఇదే క్రమంలో ఇటీవల అమెరికాలో టిక్ టాక్ యాప్ ని నిషేధిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. అయితే.. తాజాగా ఈ యాప్ ప్లే స్టోర్స్ లో ప్రత్యక్షమవుతోంది!

అవును... ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్ టాక్ ను యూఎస్ నిబంధనలకు కట్టుబడని కారణంగా జనవరి 18న దాన్ని ప్లే స్టోర్ ల నుంచి గూగుల్, యాపిల్ తొలగించాయి. అయితే.. దీనిపై నిషేధాన్ని అమలు చేయడంలో ట్రంప్ ఆలస్యం చేస్తుండటంతో అమెరికాలో యాప్ స్టోర్స్ లో టిక్ టాక్ మళ్లీ ప్రత్యక్షమైంది.

వాస్తవానికి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ యాప్ కొనుగోలుపై చర్చ జరిగే అవకాశం ఉందనే చర్చ ఇటీవల తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఈ యాప్ ను కొనుగోలు చేయనున్నరని తొలుత ప్రచారం జరిగింది. అయితే.. ఆ ఉద్దేశ్యం తనకు లేదని మస్క్ క్లారిటీ ఇచ్చారు.

మరోపక్క.. సావరిన్ వెల్త్ ఫండ్ టాపిక్ తెరపైకి తెచ్చారు ట్రంప్. ఇందులో భాగంగా.. దీని సృష్టించాలని అమెరికా ట్రెజరీ, వాణిజ్య విభాగాలను ఆదేశించారు. కొత్తగా సృష్టించిన ఈ వెల్త్ ఫండ్ టిక్ టాక్ ను కొనుగోలు చేసే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో.. అమెరికాలో టిక్ టాక్ ఫ్యూచర్ పై రకరకాల అభిప్రాయాలూ తెరపైకి వస్తున్నాయి.

వాస్తవానికి డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన అనంతరం.. 75 రోజుల్లోగా టిక్ టాక్ ను అమ్మేయాలంటూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం.. సంస్థ జాయింట్ వెంచర్ లో 50 శాతం వాటా ఇస్తే దానికి ప్రయోజనం చేకూరేల నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు!

కాగా... 2017లో ప్రారంభమైన టిక్ టాక్ ను భారత్ సహా పలు దేశాలు నిషేధించాయి. ఇదే సమయంలో.. అమెరికాలోని కొన్ని రాష్ట్రాలూ దీని వినియోగంపై ఆంక్షలు పెట్టాయి. ఈ యాప్ అమెరికా పౌరుల సమాచారాన్ని చైనాకు చేరవేస్తోందనే ఆరోపణలు బలంగా వినిపించాయి.

Tags:    

Similar News