ప్రపంచ ఉత్తమ కంపెనీల జాబితా విడుదల.. భారతీయ కంపెనీల్లో ఆ సంస్థనే టాప్..

ప్రపంచంలోని అత్యుత్తమ 1000 కంపెనీల జాబితాను టైమ్ మ్యాగజైన్ విడుదల చేసింది.

Update: 2024-09-14 09:48 GMT

ప్రపంచంలోని అత్యుత్తమ 1000 కంపెనీల జాబితాను టైమ్ మ్యాగజైన్ విడుదల చేసింది. ‘టైమ్ బెస్ట్ కంపెనీస్-2024’ పేరిట టైమ్ మ్యాగజైన్ ఈ జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో భారతదేశానికి సంబంధించి 22 సంస్థలు చోటు దక్కించుకోవడం విశేషం.

ఎంప్లాయిస్ సంతృప్తి, కంపెనీ ఆదాయంలో వృద్ధి ఆధారంగా టైమ్ కంపెనీలకు ర్యాంకులు ఇస్తుంటుంది. ఈసారి కూడా వాటినే బేస్ చేసుకొని ఈ ర్యాంకులను ప్రకటించింది. 50 దేశాల్లో మొత్తం 1,70,000 మంది ఉద్యోగులపై ఈ సర్వే నిర్వహించినట్లు టైమ్ తెలిపింది. అలాగే.. 2021 నుంచి 2023 సంవత్సరాల మధ్య వృద్ధిని లెక్కలోకి తీసుకున్నట్లు పేర్కొంది. 2023 నాటికి 100 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఆదాయం కలిగి ఉన్న వాటిని ఇందులో ఎంపిక చేసింది.

ఇందులో భాగంగా భారతీయ కంపెనీల జాబితాలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ టాప్ ప్లేసులో నిలిచింది. 112 ర్యాంకుతో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆ తర్వాత 119 ర్యాంకుతో ఇన్ఫోసిస్, 134 ర్యాంకుతో విప్రో, 187 ర్యాంకుతో మహీంద్రా గ్రూపు నిలిచాయి. ఇక బ్యాంకుల విషయానికి వస్త యాక్సిస్ బ్యాంక్ 504 ర్యాంకుతో ముందంజలో ఉంది. ఆ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 518 ర్యాంక్, ఐసీఐసీఐ 525, కొటక్ మహీంద్ర 551 ర్యాంకులు దక్కించుకున్నారు. అత్యధిక ధనవంతులైన అంబానీ, అదానీల కంపెనీలకు టాప్ ర్యాంకులు దక్కలేదు. అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు 646 ర్యాంక్, అదానీ గ్రూప్ 736 ర్యాంక్ సాధించింది.

వీటితోపాటే వెయ్యిలోపు నిలిచిన మరికొన్ని కంపెనీల ర్యాంకులను టైమ్ రిలీజ్ చేసింది. ఎల్అండ్‌టీ 549, ఐటీసీ 586, హీరో మోటోకార్ప్ 597, మథర్‌సన్ గ్రూప్ 697, ఎన్‌టీపీసీ లిమిటెడ్ 752, యెస్ బ్యాంక్ 783, బ్యాంక్ ఆఫ్ బరోడా 850, గోద్రెజ్ 921, బజాజ్ గ్రూప్ 952, సిప్లా 957, భారత్ ఎలక్ర్టానిక్స్ లిమిటెడ్ 987, ఎంఆర్ఎఫ్ 993 ర్యాంకులు సాధించారు.

Tags:    

Similar News