తిరుపతి కేంద్రంగా అంతర్జాతీయ దేవాలయాల సదస్సు

ఆ మధ్యన సనాతన ధర్మ బోర్డు దేశంలో ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి వేదికగానే వారాహి సభను నిర్వహించి డిక్లరేషన్ చేశారు.

Update: 2025-02-17 03:47 GMT

అంతర్జాతీయ ఆధ్యాత్మిక సదస్సుకు తిరుపతిని వేదికగా ఎంచుకున్నారు. ఆ సదస్సు కూడా చాలా కీలకమైనది అంతర్జాతీయ దేవాలయాల సదస్సు పేరుతో నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేందర్ ఫడ్నవీస్ సంయుక్తంగా సోమవారం ప్రారంభిస్తున్నారు అంటేనే ఈ సదస్సు ప్రాముఖ్యత ఏంటి అన్నది అర్ధమవుతోంది.

ఈ సదస్సుకు ఏకంగా 58 దేశాల నుంచి 11 మంది ప్రముఖ వక్తలు హాజరవుతున్నారు. దేవాలయాల నిర్వహణ, వాటి పద్ధతులు ఉత్తమమైన విధానాలు దేవాలయాల ప్రాంగణాలలో ఉండాల్సిన ఆధ్యాత్మిక పర్యావరణ వ్యవస్థలు ఇవన్నీ ఈ సదస్సులో చోటు చేసుకోబోతున్నాయి.

మూడు రోజుల పాటు జరిగే ఈ అంతర్జాతీయ సదస్సులో సాంకేతికత అందిపుచ్చుకుని డిజిటలైజేషన్ ఆధారిత ఆర్ధిక వ్యవస్థను ఎలా పెంపొందించవచ్చు అన్నది కూడా చర్చించనున్నారు. అంతే కాదు ఈ అంతర్జాతీయ సదస్సు వికసిత్ భారత్ అన్న ప్రధాని నరేంద్ర మొడీ లక్ష్యానికి అనుసంధానం చేయడమే అతి ముఖ్య ఉద్దేశ్యంగా చెబుతున్నారు.

ఈ సదస్సు అంత్యోదయ ప్రతిష్టాన్ సంస్థ నిర్వహిస్తోంది. ఈ సదస్సు ద్వారా ఇసనాతన ధర్మం, ధార్మిక కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు ఆ సంస్థ ప్రయత్నిస్తోంది. మొత్తం మీద చూస్తూంటే తిరుపతి వేదికగా ఇంత పెద్ద సదస్సు నిర్వహించాలనుకోవడం విశేషం.

ఆ మధ్యన సనాతన ధర్మ బోర్డు దేశంలో ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి వేదికగానే వారాహి సభను నిర్వహించి డిక్లరేషన్ చేశారు. ఇపుడు ఏకంగా ప్రపంచ దేవాలయాల సదస్సు జరుగుతోంది. దీనికి బీజేపీ ముఖ్యమంత్రి దేవేందర్ ఫడ్నవీస్ హాజరవుతున్నారు అంటే ఏపీలో ఈ తరహా సదస్సు నిర్వహించడం ద్వారా మరింతగా సనాతన ధర్మం మీద చర్చ జరగాలని కోరుకుంటున్నట్లుగానే ఉంది అంటున్నారు.

ఈ సదస్సు వెనక బీజేపీ సహా ధార్మిక సంస్థలు ఉన్నాయని తెలుస్తోంది. బీజేపీకి చెందిన మహారాష్ట్ర శాసనమండలి సభ్యుడు ప్రసాద్ లాడ్ ఈ సదస్సు గురించి మీడియాకు తెలియచేశారు. నరేంద్ర మోడీకి బాసటగా ఉండడానికే ఈ తరహా సదస్సులు అని చెబుతున్నారు. మొత్తం మీద చూస్తే ఈ అంతర్జాతీయ దేవాలయాల సదస్సు అన్నది మాత్రం ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంగా ఏపీలో ఉండనుంది. ఈ సదస్సు ద్వారా ఏ రకమైన డిక్లరేషన్లు రూపొందిస్తారు అన్నది చూడాల్సి ఉంది. ప్రపంచ దేవుడు వెంకటేశ్వరస్వామి వారి సన్నిధిలో నిర్వహిస్తున్న ఈ సదస్సు మీద సర్వత్రా ఆసక్తి అయితే ఉంది.

Tags:    

Similar News