జగన్ కి బాబు కూటమికి ఫిఫ్టీ ఫిఫ్టీ చాన్సేస్ నా ?

ఏపీలో రాజకీయం ఎవరికీ అర్ధం కావడం లేదు. ప్రజల మనసులో ఏముందో అసలు బయటపడడం లేదు.

Update: 2024-04-25 11:06 GMT

ఏపీలో రాజకీయం ఎవరికీ అర్ధం కావడం లేదు. ప్రజల మనసులో ఏముందో అసలు బయటపడడం లేదు. గతంలో మాదిరిగా వేవ్ లేకపోవడం వల్ల కూడా తలపండిన రాజకీయ విశ్లేషకులు కూడా ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారు అన్న దాని మీద అంత సులువుగా ఏమీ చెప్పలేకపోతున్నారు. అయితే పోటా పోటీగా మాత్రం ఏపీలో రాజకీయ వాతావరణం ఉంది అని అంటున్నారు.

ఇదిలా ఉంటే ఏపీలో ఎన్నడూ చూడని రాజకీయ పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. చాలా టైట్ గానే ఈసారి ఎన్నికలు జరుగుతున్నాయని అంటున్నారు. ఓటర్ల మొగ్గు ఏ వైపు పూర్తిగా లేదు అని అంటున్నారు. మరో వైపు చూస్తే ఈసారి ఎన్నికలకు సెంటర్ పాయింట్ గా జగన్ మారారు. ఆయన చుట్టూనే ఎన్నికలు మొత్తం తిరుగుతున్నాయి.

జగన్ ని ఓడించాలా లేక గెలిపించాలా అన్నదే ఇపుడు ఏపీలో ప్రజలకు ఉన్న ఆప్షన్ గా కనిపిస్తోంది. మిగిలిన అంశాలేవీ ప్రభావితం చేయడంలేదు. చంద్రబాబు పాలన మీద ఆయన అనుభవం మీద లేక ఆయన విశ్వసనీయత మీద ఎన్నికలు అయితే జరగడం లేదు ఆ పాయింట్లు జనంలో చర్చకు పెద్దగా వెళ్ళడంలేదు అని చెప్పాలంటున్నారు.

కాస్తా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే 2014లో చంద్రబాబు సీనియారిటీ ఆయన అనుభవం మీద ఎన్నికలు జరిగాయి. ఈ అంశాలే ఆ ఎన్నికల్లో ఎక్కువగా ప్రభావం చూపించాయి. దాంతో తెలుగుదేశానికి ఎంతో ప్రయోజనం చేకూరింది. అంతే కాదు టీడీపీ ఆనాడు గెలిచింది కూడా. అదే విధంగా 2019 ఎన్నికలు చూస్తే జగన్ కి ఒక్క చాన్స్ ఇవ్వాలన్న దాని మీదనే తిరిగాయి. దాంతో ఆనాడు వార్ వన్ సైడ్ అయింది. వైసీపీ 151 సీట్లతో అధికారంలోకి వచ్చింది.

ఇక 2024 ఎన్నికలు చూస్తే కనుక ప్రధాన అంశాలు ఏవీ చర్చకు రావడం లేదు. నిజం చెప్పాలంటే బాగా పెరిగిన నిత్యావసర ధరలు కానీ అదే విధంగా భారీగా ఉన్న నిరుద్యోగ సమస్య మీద కానీ ఏపీలో అత్యంత సీనియర్ చంద్రబాబు గురించి కానీ అలాగే సీఎం గా అయిదేళ్ల పాలనలో జగన్ చేసిన సంక్షేమ పధకాల మీద కానీ ఈ ఎన్నికలు జరగడం లేదు. జనాలలో ఈ పాయింట్లు కూడా పెద్దగా వెళ్ళడంలేదు అని చెప్పాలి.

ఇక చూసుకుంటే కనుక అయిదేళ్ళ పాలనలో జగన్ చేసిన సంక్షేమ పధకాల అమలు మీద కేవలం ఇరవై అయిదు శాతం మాత్రమే పాయింట్లు ఇస్తున్నారు. అదే విధంగా వైఎస్సార్ మీద అభిమానం జగన్ మీద అభిమానంతో మరో ఇరవై అయిదు పాయింట్లు ఆయనకు వస్తున్నాయి. అలా యాభీ శాతం పాయింట్లతో వైసీపీ ఎన్నికల్లో ఫైట్ చేస్తోంది.

మరో వైపు చూస్తే టీడీపీ కూటమికి కూడా యాభై పాయింట్లు ఇస్తున్నారు. అందులో టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ క్యడర్ కి అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమిలో ఉండంతో యాడ్ అయిన కుల సమీకరణలు,అలాగే మోడీ ఈ కూటమిలో చేరడంతో మోడీ మేనేజ్మెంట్ మీద కూడా ఈ పాయింట్లు అన్నీ ఇస్తున్నట్లుగా ఉంది.

ఇక ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రతీ సీటులో టైట్ ఫైట్ సాగే లాగానే ఉంది. ఒక్క ఓటు అటు నుంచి ఇటు చేరినా ఉపద్రవం అన్నట్లుగానే ఈసారి ఎన్నికలు ఉండబోతున్నాయి. నువ్వా నేనా అన్న సిట్యువేషన్ అన్ని చోట్లా కనిపిస్తోంది. ఈ సీటు ఈజీ అని కానీ ఫలానా పార్టీ గెలుచుకుంటుంది అని కానీ చెప్పలేని స్థితి ఉంది అని అంటున్నారు.

ఇక పార్టీలు చూస్తే సర్వేల మీద సర్వేలు చేయించుకుని మరీ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చారు. కానీ ఇపుడు చూస్తే రాజకీయ కురుక్షేత్రాన్ని తలపించేలా ఎన్నికలు ఉన్నాయి. దాంతో ఈసారి ఎన్నికల్లో ఈవీఎం లో పడే ఓటే అత్యంత కీలకం. అంటే ఓటుని ఏ పార్టీ జాగ్రత్తగా తమ వైపు వేయించుకుంటుందో అన్నదే ఇక్కడ ప్రధానం. దీనినే పోల్ మేనేజ్మెంట్ అని అంటారు. ఈ విషయంలో ఎవరు ముందు ఉంటే వారిదే విజయం.

అంటే ఇపుడు సీన్ పూర్తిగా పోల్ మేనేజ్మెంట్ వైపే ఉంది అన్న మాట. ఈ ప్రచారాలు హడావుడి సవాళ్ళూ ప్రతి సవాళ్ళూ ఎన్ని జరుగుతున్నా ఈవీఎం లోనే అసలైన మ్యాజిక్ ఉంది అక్కడ తమ పార్టీ ఓట్లు ఎవరు జాగ్రత్తగా వేయించుకుంటారో వారు రేపటి సీఎం అని అంటున్నారు. దాంతో ఎలక్షనీరింగ్ లో ఎవరికి అనుభవం బాగా ఉంది. ఎవరికి వ్యవస్థల సహకారం దక్కుతుంది ఈ విషయంలో ఎవరు పులి అన్న దాని బట్టే విజేత బయటకు వస్తారు అని అంటున్నారు. చూడాలి మరి.

Tags:    

Similar News