త్వరలో టీపీసీసీకి కొత్త చీఫ్!... లీగ్ దశలోని లిస్ట్ ఇదే!?
ఇదే సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి, మధు యాష్కీ, సంపత్ కుమార్, షబ్బీర్ అలీ, ముకేష్ కుమార్, అంజన్ కుమార్ మొదలైన నేతలు రేసులో ఉన్నారని అంటున్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికలు ముగిసాయి. జూన్ 4న విడుదలయ్యే ఫలితాల కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలూ తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఆ సంగతి అలా ఉంటే... తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ఫలితాలపై మూడు పార్టీలూ ధీమాగానే ఉన్న సంగతి తెలిసిందే.
అటు బీఆరెస్స్, ఇటు బీజేపీలు తమకు మెజారిటీ స్థానాలు వస్తాయని చెబుతున్నారు. ఇదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే లోక్ సభ ఎన్నికల్లోనూ సత్తాచాటబోతున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమాగా చెబుతున్నారు. ఇదే క్రమంలో... ఇక ఎన్నికలు, రాజకీయాలూ ముగిసాయని.. ఇక దృష్టంతా పాలనపైనే అని ప్రకటించారు.
అయితే... లోక్ సభ ఎన్నికల ఫలితాల అనంతరం టీపీసీసీ కొత్త అధ్యక్షుడి నియామకం ఉండొచ్చని చెబుతున్నారు. అవును... తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి పీసీసీ చీఫ్ గా ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఉన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ముఖ్యమంత్రి పదవిలోనూ ఆయనే ఉన్నారు. అయితే... లోక్ సభ ఎన్నికల అనంతరం టీపీసీసీ చీఫ్ గా కొత్త వారిని నియమించబోతున్నారని తెలుస్తుంది.
దీంతో... తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్ష పదవి కోసం పోటీ భారీగా ఉందనే చర్చ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా రేవంత్ రెడ్డితో సీఎం పదవికి సైతం పోటీ పడినట్లు చెప్పే భట్టి విక్రమార్క పేరు ఈ జాబితాలో ప్రథమంగా వినిపిస్తుందని అంటున్నారు. రేవంత్ కి పీసీసీ బాధ్యతలు తప్పించేదే... భట్టికి ఇవ్వడానికనే చర్చా నడుస్తుంది.
ఇదే సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి, మధు యాష్కీ, సంపత్ కుమార్, షబ్బీర్ అలీ, ముకేష్ కుమార్, అంజన్ కుమార్ మొదలైన నేతలు రేసులో ఉన్నారని అంటున్నారు. ఇదే క్రమంలో సీతక్క పేరు కూడా వినిపిస్తుంది. దీంతో... టీపీసీసీ కొత్త చీఫ్ ఎంపిక విషయంలో ఏఐసీసీ ఏయే విషయాలను పరిగణలోకి తీసుకోబోతొందనేది ఆసక్తిగా మారింది.