రాజస్థాన్ లో 'సంప్రదాయం' తప్పనుందా?... ఆసక్తిగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు

కారణం... అక్కడున్న సంప్రదాయమే! దీంతో... ఈసారి కూడా రాజస్థాన్ ఓటర్లు సాంప్రదాయం పాటించారా.. లేక, సంప్రదాయం ఈసారి తప్పబోతుందా అనేది ఆసక్తిగా మారింది.

Update: 2023-12-01 04:10 GMT

ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన అనంతరం ఎగ్జిట్ పోల్ ఫలితాల సందడి మొదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎగ్జిట్ పోల్ ఫలితాలు బూస్ట్ ఇచ్చాయి. ఇక మిగిలిన నాలుగు రాష్ట్రాలలోనూ రాజస్థాన్ ఫలితాలపై ఆసక్తి నెలకొంది. కారణం... అక్కడున్న సంప్రదాయమే! దీంతో... ఈసారి కూడా రాజస్థాన్ ఓటర్లు సాంప్రదాయం పాటించారా.. లేక, సంప్రదాయం ఈసారి తప్పబోతుందా అనేది ఆసక్తిగా మారింది.

అవును... రాజస్థాన్ ఓటర్లు ఒక సంప్రదాయాన్ని పాటిస్తుంటారు. అందులో భాగంగా ప్రతి ఐదేళ్లకూ ప్రభుత్వాన్ని మార్చేస్తుంటారు! కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నారు, ఎవరు వచ్చే అవకాశం ఉంది అనే విషయాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోనట్లుగా కనిపించే ఆ ప్రజలు... ప్రతి ఐదేళ్లకూ ఒక సారికి అటు వారిని ఇటు, ఇటు వారిని అటు చేస్తూ ఉంటారు.

సచిన్ పైలట్ అయితే ఈ సారి మాత్రం అందుకు విరుద్ధంగా రాజ‌స్తానీ ప్రజ‌ల తీర్పు ఉండ‌బోతోంద‌ని అంటున్నాయి ఎగ్జిట్ పోల్ స‌ర్వేలు. ఇదే విషయంపై ఎన్నికల ప్రచార సమయంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కీలక నేత సచిన్ పైలట్ జోస్యం చెప్పారు. అయితే తాజాగా వెలువడుతున్న ఎగ్జిట్ పోల్ ఫలితాలు మరోసారి రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నాయి.

రాజస్థాన్‌ లో 200 స్థానాలకు గాను 199 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అధికారం చేపట్టాలంటే ఏపార్టీ అయినా 100 స్థానాల్లో గెలుపొందాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇండియా టుడే మీడియా సంస్థ వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం... కాంగ్రెస్ కు 119 - 141 సీట్లు ద‌క్కే అవ‌కాశం ఉంది. ఇదే సమయంలో... న్యూస్ నేష‌న్ స‌ర్వే కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ 100ను దాటే అవకాశం ఉందని పేర్కొంది.

దీంతో... రాజస్థాన్ లో సాంప్రదాయం మారబోతుందా అనే చర్చ మొదలైంది. మరోపక్క మరికొన్ని సర్వే సంస్థలు రాజస్థాన్ లో బీజేపీకి మెజారిటీ దక్కే అవకాశాలున్నాయని చెబుతుండటం గమనార్హం. టైంస్ నౌ సంస్థ ఇక్కడ బీజేపీకి ఎడ్జ్ ఉంటుందని పేర్కొనగా... పోల్ స్టార్ట్ సర్వే సంస్థ మాత్రం కాంగ్రెస్ - బీజేపీల మధ్య హోరా హోరీ పోరు తప్పదని.. ఈ సమయంలో ఇతరులు కీలక భూమిక పోషించే అవకాశం లేకపోలేదని వెల్లడించింది.

Tags:    

Similar News