యువతి ఆత్మహత్య... తెరపైకి 'ఢీ' షో డ్యాన్సర్ పేరు!
ఈ సందర్భంగా... తాను ఆత్మహత్య చేసుకోవడానికి ఇతడే కారణం అంటూ ఢీ షో లోని ఓ డ్యాన్సర్ పేరు ఆమె చెప్పడం సంచలనంగా మారింది!;
ఖమ్మం జిల్లాలో దారుణం జరిగిపోయింది. ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ లో విషాదం చోటు చేసుకుంది. సెల్ఫీ వీడియో తీసుకొని ఓ యువతి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ సందర్భంగా... తాను ఆత్మహత్య చేసుకోవడానికి ఇతడే కారణం అంటూ ఢీ షో లోని ఓ డ్యాన్సర్ పేరు ఆమె చెప్పడం సంచలనంగా మారింది!
అవును... ఖమ్మం జిల్లాలోని, ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ లో ఓ యువతి ఆత్మహత్య చేసుకొంది. అంతకంటే ముందు సెల్ఫీ వీడియో తీసుకున్న ఆమె.. తన ఆత్మహత్యకు ఢీ షోలో డ్యాన్సర్ అభి కారణం అని పేర్కొంది. సూసైడ్ ముందు తీసుకున్న ఈ సెల్ఫీ వీడియోలో... తన ఆత్మహత్యకు గల కారణాన్ని వివరించింది!
ఇందులో భాగంగా... పెళ్లి పేరుతో తనను మోసం చేసి, మరో యువతితో ఉన్నాడని ఈమె వీడియోలో తెలిపింది. తనను పెళ్లి చేసుకుని, తనతో కాపురం చేస్తూ.. ఇప్పుడు మరొకరిని వివాహం చేసుకున్నట్లు తెలిసిందని చెబుతూ.. ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అందుతున్న వివరాల ప్రకారం... ఖమ్మం బ్యాంక్ కాలనీకి చెందిన ఈ యువతికి చిన్నప్పటి నుంచీ డ్యాన్స్ అంటే చాలా ఇష్టమట. దీంతో.. కుటుంబ సభ్యులను ఒప్పించి, ఖమ్మంలోని ఓ డ్యాన్స్ స్కూల్ లో చేరింది. ఈ క్రమంలోనే అభితో పరిచయం అయ్యింది! డైలీ ఇద్దరూ కలిసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేవారు!
ఈ క్రమంలోనే ఇద్దరి మధ్యా ప్రేమ చిగురించింది. ఈ సమయంలో పొన్నెకల్ లో ఉన్న తన అమ్మగారింట్లో ఈమెను తీసుకెళ్లి ఉంచాడు అభి! ఈ క్రమంలో సుమారు ఐదు సంవత్సరాలుగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని చెబుతున్నారు. అయితే.. ఇటీవల అభి మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడని ఈమెకు తెలిసిందని అంటున్నారు.
దీంతో... తీవ్ర మనస్థాపానికి గురైన కల్యాణి.. తన ఆత్మహత్యకు అభినే కారణమని సెల్ఫీ వీడియో తీసుకుని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో... యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. ఖమ్మం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.