ఖజానా ఖాళీ.. ఎవరొచ్చినా.. తిప్పలే.. లోక్‌సభ పై ఎఫెక్టే !
అయినప్పటికీ.. కాంగ్రెస్ పూర్తిగా పుంజుకుని అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సంరంభం పూర్తయింది. ఇక, మిగిలింది అధికారికంగా ఓట్ల లెక్కింపు, ఫలి తం వెల్లడించడం. అయితే.. ఇప్పటికే వచ్చిన ఎగ్జిట్ పోల్ సర్వేల్లో కాంగ్రెస్, బీఆర్ ఎస్‌ల మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని లెక్కలు వచ్చాయి. అయినప్పటికీ.. కాంగ్రెస్ పూర్తిగా పుంజుకుని అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. అయితే.. ఎవరు అధికారంలోకి వచ్చినా.. ఖజానా అయితే ఖాళీగా దర్శనమిస్తోంది.
ఒక్క రైతు బంధు నిధుల కోసం.. తీసుకువచ్చిన సొమ్ములు తప్ప.. ప్రస్తుతం ఖజానాలో అదనంగా 10 కోట్ల రూపాయలు కూడా లేవని ఆర్థిక వర్గాలు చెబుతున్న మాట. పైగా డిసెంబరు నెల ప్రారంభం కావడం తో ఉద్యోగులకు జీతాలు చెల్లించాలి. సో.. రాష్ట్రంలో ఆదాయం వచ్చినా.. వాటికే ఖర్చులు సరిపోతాయి. ఇతరత్రా ఖర్చులకు నిధులు లేని పరిస్థితి వచ్చింది. దీంతో కాంగ్రెస్ వచ్చినా.. బీఆర్ ఎస్ వచ్చినా.. పాలన ప్రారంభమై.. కొత్తగా ప్రకటించిన పథకాలు అమల్లోకి వచ్చేందుకు కనీసం రెండు మాసాలైనా పడుతుందని లెక్కలు వేస్తున్నారు.
అయితే.. ఇంతలోనే మళ్లీ సార్వత్రిక సమరం ప్రారంభం కానుంది. మార్చి తొలివారంలోనే ఈ దఫా లోక్‌స భ ఎన్నికలకు.. నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో మళ్లీ ఎన్నికల నామ సంవత్సరం ప్రా రంభం కానుంది. అప్పటికి ఆ ఎన్నికల్లో లబ్ధి పొందాలంటే.. ఇప్పుడు.. ఇచ్చిన హామీలను రేపు అధికా రంలోకి వచ్చే పార్టీ వడివడిగా నెరవేర్చాల్సి ఉంటుంది. లేకపోతే.. లోక్‌సభ ఫలితాలపై ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది.
సో.. ఎలా చూసుకున్నా.. అధికారంలోకి వచ్చే పార్టీకి రెండు పక్కలా తిప్పలు తప్పేలా కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకలు. ఇప్పటికిప్పుడు పథకాలు అమలు చేయాలంటే.. ఖజానాలో సొమ్ము కావాలి. అలాగని.. ఆలస్యం చేద్దామంటే.. లోక్‌సభ ఎన్నికల ముహూర్తం రెడీ అవుతోంది. దీంతో ఎవరు అధికారంలోకి వచ్చినా.. మూడు మాసాలు మాత్రం ముప్పతిప్పలు పడాల్సిందేనని అంటున్నారు పరిశీలకులు. ఏ చిన్న తేడా వచ్చినా లోక్‌సభ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. ఇదీ.. సంగతి..!