ఫుడ్ ఇవ్వలేదని హోటల్ పైకి లారీని పోనిచ్చాడు... వీడియో వైరల్!

వివరాళ్లోకి వెళ్తె... మహారాష్ట్రలొని పూణేలో ఇంద్రాపూర్ హింగాన్ గావ్ లోని హోటల్ గోకుల్ వద్ద ఓ డ్రైవర్ హల్ చల్ చేశాడు.

Update: 2024-09-07 14:30 GMT

ఫుడ్ ఇవ్వలేదనే కోపంతో ఓ లారీ డ్రైవర్ ట్రక్కుతో ఏకంగా ఆ హోటల్ పైకి దూసుకెళ్లాడు.. అక్కడ చేయాల్సిన రచ్చ అంతా చేశాడు.. ఈ దాడిలో హోటల్ భవనం ఎక్కువగానే దెబ్బతింది.. ఈ ట్రక్కుతో చేసిన రచ్చలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.

అవును... అప్పటికే ఓ ట్రక్కు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడు. అదే కారణమో.. లేక, మరేదైనా కారణం ఉందో ఏమో తెలియదు కానీ... సదరు ట్రక్కు డ్రైవర్ కి ఆహారం ఇవ్వడానికి హోటల్ యజమాని నిరాకరించాడట. దీంతో... కట్టలు తెంచుకున్న ఆగ్రహంతోనో, ఆకల బాధతోనో తన ట్రక్కుని హోటల్ పైకి పోనిచ్చి నానా రచ్చా చేశాడు.

వివరాళ్లోకి వెళ్తె... మహారాష్ట్రలొని పూణేలో ఇంద్రాపూర్ హింగాన్ గావ్ లోని హోటల్ గోకుల్ వద్ద ఓ డ్రైవర్ హల్ చల్ చేశాడు. షోలాపూర్ నుంచి పూణే వెళ్తున్న ట్రక్కు డ్రైవర్ ఆ హోటల్ వద్ద ఆగాడు. తర్వాత లోపలికి వెళ్లి ఆహారం అడిగాడు. అయితే... అతడికి ఫుడ్ ఇవ్వడానికి ఆ హోటల్ యాజమాన్యం నిరాకరించింది.

దీంతో... అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి... తన ట్రక్కులో కూర్చుని దాన్ని హోటల్ భవనంపైకి పోనిచ్చాడు. ఈ సమయంలో హోటల్ బయట ఉన్న కారును కూడా ఢీకొట్టాడు. ఈ సమయంలో ఇతడిని ఆపడానికి కొంతమంది వ్యక్తులు ఆ ట్రక్కుపై రాళ్లు రువ్వారు. అయితే.. ఆ రాళ్లు చక్రాల కింద పడటంతో ఒకానొక సాయంలో ఆ ట్రక్కు ముందుకు కదలలేక ఆగిపోయింది.

అయితే ఈ ఘటనలో హోటల్, హోటల్ బయట నిలిపి ఉంచిన కారు దెబ్బతిన్నాయి తప్ప.. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అంటున్నారు. ఈ సమయంలో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో... హోటల్ వద్దకు చేరుకున్న పోలీసులు ట్రక్కు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. విచారణ జరుపుతున్నారు.

ఈ సమయంలో అక్కడ ఈ ట్రక్కు డ్రైవర్ చేస్తున్న రచ్చ ను కొంతమంది తమ ఫోన్ లో వీడియో తీశారు. దానికి సంబంధించిన వీడియో నెట్టింట సందడి చేస్తుంది.

Tags:    

Similar News