ట్రంప్ దూకుడు మాములుగా లేదు.. ఆ విషయంలో మస్క్ వెనక్కి!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ కు సంబంధించిన "ట్రూత్" సోషల్ మీడియా తాజాగా ఆయనకు గుడ్ న్యూస్ చెప్పింది

Update: 2024-10-30 19:30 GMT

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ కు సంబంధించిన "ట్రూత్" సోషల్ మీడియా తాజాగా ఆయనకు గుడ్ న్యూస్ చెప్పింది! ఇందులో భాగంగా.. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కు చెందిన సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ "ఎక్స్"కు ఉన్న విలువను ట్రంప్ కు సంబంధించిన సోషల్ మీడియా "ట్రూత్" ఆధిగమించింది.

అవును... ఎలాన్ మస్క్ కు చెందిన సోషల్ మీడియా ఫ్లాంట్ ఫామ్ "ఎక్స్" కంటే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు చెందిన "ట్రూత్" మీడియా విలువైనదిగా రికార్డ్ సృష్టించింది. ఇందులో భాగంగా... రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ నకు సంబంధించిన "ట్రూత్" షేర్లు దూసుకుపోతున్నట్లు ఇన్వెస్ట్ మెంట్ గ్రూప్ ఫిడిలిటీ వెల్లడించింది.

ఈ క్రమంలో... ప్రస్తుతం "ఎక్స్"కు 9.4 బిలియన్ డాలర్ల (సుమారు రూ.79 వేల కోట్లు) విలువ ఉండగా.. ట్రంప్ "ట్రూత్" 10 బిలియన్ డాలర్లు (సుమారు రూ.84 వేల కోట్లు)తో ముందుస్థానంలో ఉందని చెబుతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో పెట్టుబడిదారులు మరింత విశ్వాసంతో అందులో పెట్టుబడులు పెడుతున్నారని నిపుణులు పేర్కొంటున్నారు.

ఇదే సమయంలో... ట్రూత్ కంపెనీ ఎక్స్ తో పాటు సీజర్స్ ఎంటర్ టైన్ మెంట్, వాల్ గ్రీన్స్ బూట్స్ అలయన్స్, మ్యాచ్ గ్రూప్, మోనోపోలీ గేమ్ తయారీదారు హస్బ్రోతో సహా పలు కంపెనీలను అధిగమించినట్లు ఇన్వెస్ట్ మెంట్ గ్రూప్ ఫిడిలిటీ వెల్లడించింది.

Tags:    

Similar News