ట్రంప్ గెలిస్తే మొదటి సంతకం దీనిపైనే... వారికి బ్యాడ్ టైమ్ స్టార్ట్!

యూఎస్ లో ఎన్నికలే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అని చెప్పాలి.

Update: 2024-10-26 04:01 GMT

యూఎస్ లో ఎన్నికలే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అని చెప్పాలి. ఈ ఎన్నికల్లో తాను విజయం సాధిస్తే.. అంటూ ఇప్పటికే ఎన్నో హామీలు ఇచ్చిన మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తాజాగా తొలి సంతకంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అమెరికన్స్ ను సెంటిమెంట్ తో బలంగా టచ్ చేసే ప్రయత్నం చేశారని అంటున్నారు.

అవును... అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నార్త్ కరోలినాలోని కాన్కార్డ్ కన్వెషన్ సెంటర్ లో ఇటీవల జరిగిన ర్యాలీలో ట్రాన్స్ జెండర్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... ప్రభుత్వ పాఠశాలలో ట్రాన్స్ జెండర్ ఐడియాలజీని నిషేధించడానికి కట్టుబడి ఉన్నట్లు పునరుధ్ఘాటించారు.

ఈ సందర్భంగా 11వ అవర్ ఫెయిత్ లీడర్స్ మీటింగ్ లో ప్రసంగించిన ట్రప్ 2024లో మళ్లీ ఎన్నికైతే తక్షణ కార్యచరణకు సంబంధించిన ప్రణాళికలను వివరించారు. ఈ నేపథ్యంలోనే... "క్రిటికల్ రేస్ థియరీ లేదా ట్రాన్స్ జెండర్ పిచ్చిని నిషేధించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై తొలి సంతకం చేస్తాను" అని ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.

ఇదే సమయంలో... దేవుడు రెండు లింగాలనే సృష్టించాడని.. అవి మగ, ఆడ మాత్రమే అని.. అదే తన నమ్మకమని ట్రంప్ నొక్కి చెప్పారు. ఇదే సమాంలో.. మహిళా క్రీడల్లో ట్రాన్స్ జెండర్ మహిళలను పోటీకి అనుమంతించడంపై కమలా హారిస్ వైఖరిని ట్రంప్ తప్పు పట్టారు! అది సంప్రదాయ విలువలను దెబ్బతీస్తుందని విమర్శించారు.

ఈ నేపథ్యంలోనే... కమలా హారిస్ క్రైస్తవ మతం పట్ల వ్యతిరేకతతో ఉన్నారని ట్రంప్ ఆరోపించారు. తాను అధికారంలోకి వస్తే.. మహిళల క్రీడల్లో ట్రాన్స్ జెండర్లను దూరంగా ఉంచుతానని, ఈ విషయంలో 50 రాష్ట్రాల్లోనూ నిషేధం విధించేలా చట్టం చేస్తానని ట్రంప్ ఈ మేరకు హామీ ఇచ్చారు. ఇదే సమాంలో విద్యలో మత స్వేచ్ఛకు తన నిబద్ధతను ట్రంప్ నొక్కి చెప్పారు.

అనంతరం... తాను అధికారంలోకి వస్తె అమెరికన్లు మళ్లీ "మెర్రీ క్రిస్మస్" అంటూ తన గత ప్రచార నినాదాన్ని గుర్తు చేసిన ట్రంప్.. అబార్షన్, సంప్రదాయ విలువల రక్షణ, నేరాలు వంటి కీలక అంశాలను ప్రస్తావించారు. ఇలా సాగిన అమెరికా మాజీ అధ్యక్షుడి ప్రసంగంపై భిన్నాభిప్రాయాలు వక్తమవుతున్నాయి.

ఇందులో భాగంగా... ఇది ట్రాన్స్ జెండర్లపై నోరు పారేసుకోవడమే అని కొంతమంది అభిప్రాయపడుతుంటే... దేవుడు రెండు లింగాలనే సృష్టించాడనే వ్యాఖ్యలతో మరికొంతమంది ఏకీభవిస్తున్నారు.

Tags:    

Similar News