ఇట్స్ బిజినెస్ టైం.. సొంత బ్రాండ్ షూ విడుదల చేసిన ట్రంప్

కానీ.. అగ్రరాజ్యానికి దేశాధ్యక్షుడిగా వ్యవహరిస్తూ వ్యాపారాల్ని చక్కబెట్టే నేతల్ని అరుదుగా చూస్తుంటాం.

Update: 2024-02-19 04:21 GMT

రాజకీయం అంటే రాజకీయమే అన్నట్లు వ్యవహరించే రోజులు పోయి చాలాకాలమే అయ్యింది. ఆ మాటకు వస్తే రాజకీయం చేస్తూనే పెద్ద ఎత్తున వ్యాపారాలు చేయటం చూస్తున్నాం.నిజానికి ఇప్పుడున్న రాజకీయాల్లో నూటికి 90 శాతం మంది ఏదో ఒక వ్యాపారం చేస్తున్న పొలిటీషిన్లే కనిపిస్తారు. కానీ.. అగ్రరాజ్యానికి దేశాధ్యక్షుడిగా వ్యవహరిస్తూ వ్యాపారాల్ని చక్కబెట్టే నేతల్ని అరుదుగా చూస్తుంటాం. అలాంటి ఇస్పెషల్ రాజకీయ నేతగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను చెప్పాలి.

ఓవైపు అమెరికాకు మరోసారి అధ్యక్షుడు అయ్యేందుకు ఆయన పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు.. తన వ్యాపార కార్యాకలాపాల్ని నిర్వహిస్తున్నారు. తాజాగా ట్రంప్ తన సొంత బ్రాండ్ షూస్ ను విడుదల చేశారు. ఆదివారం ఫిలడెల్ఫియాలోని కన్వెన్షన్ సెంటర్ లో వాటిని ప్రదర్శించిన ఆయన.. గోల్డ్ కలర్ షూను 399 డాలర్లకు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.

షూతో పాటు పెర్ ఫ్యూమ్ ను కూడా విడుదల చేయటం విశేషం. విక్టరీ 47 పేరుతో సెంటును విడుదల చేశారు. ఓవైపు ఆస్తుల విలువను ఎక్కువ చేసి చూపారన్న అభియోగాన్ని ఎదుర్కొని.. న్యాయస్థానం చేత భారీ జరిమానా విధించుకున్న పక్క రోజునే తన బ్రాండ్ వస్తువుల్ని మార్కెట్ లోకి విడుదల చేయటం చూస్తే.. ట్రంపా మజాకానా? అన్న భావన కలుగక మానదు. తాజాగా ఇచ్చిన తీర్పులో ఆయనకు 35.5 కోట్ల డాలర్ల భారీ జరిమానాను కోర్టు విధించింది. ఏమైనా వివాదాలతో సహవాసం చేసే ట్రంప్.. రాబోయే ఎన్నికల్లో తన ముద్ర చూపాలని.. మరోసారి అమెరికాకు అధ్యక్షుడు కావాలన్న పట్టుదలతో వ్యవహరిస్తున్నారు. తుది ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News