సరిగ్గా వచ్చే ఆదివారం.. మొత్తం లెక్క తేలిపోనుంది

రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఏ ఇద్దరు కలిసినా.. తెలంగాణ ఎన్నికల ఫలితాల మీదనే చర్చ జరుగుతుందని చెప్పక తప్పదు.

Update: 2023-11-26 05:35 GMT

సరిగ్గా వచ్చే ఆదివారం ఇదే సమయానికి రెండు తెలుగురాష్ట్రాల్లోని ప్రజలు తీవ్రమైన ఉత్కంటతో టీవీలు.. మొబైళ్లు.. వెబ్ సైట్లను అంటిపెట్టుకోనున్నారు. రోటీన్ వీకెండ్ కు భిన్నంగా వచ్చే ఆదివారం ఉండనుంది. ఆ మాటకు వస్తే.. వచ్చే శుక్రవారం నుంచే రాజకీయాలు మినహా మిగిలిన అంశాల మీద చర్చ జరిగేదే ఉండదని చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఏ ఇద్దరు కలిసినా.. తెలంగాణ ఎన్నికల ఫలితాల మీదనే చర్చ జరుగుతుందని చెప్పక తప్పదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కచ్ఛితంగా ఏపీ రాజకీయాల్ని..రాజకీయ వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయని చెప్పాలి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తర్వాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికలకు.. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు ఏ మాత్రం సంబంధం లేదని చెప్పాలి. గడిచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాధామ్య అంశాలు భిన్నం. ఈసారి అందుకు విరుద్ధమైన అంశాలు ఎన్నికల్లో కీ రోల్ ప్లే చేశాయి. గత ఎన్నికల ఫలితాలు డిసెంబరు 11న వెల్లడి కాగా.. ఈసారి అందుకు వారం ముందే వెల్లడి కానున్నాయి.

ఈసారి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసెంబరు 3 (ఆదివారం) వీకెండ్ రోజు కావటంతో.. కొందరిని తీవ్రమైన నిరాశకు గురి చేస్తోంది. వచ్చే ఆదివారం మొత్తం రాజకీయాలకే సరిపోతుందని.. అదే విడిరోజుల్లో ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరిగితే ఆ మజా వేరుగా ఉంటుందన్న మాట వినిపిస్తోంది. ఇదంతా చూస్తే.. వారాంతంలో కాకుండా వారం మధ్యలో ఓట్ల లెక్కింపు జరిగితే.. ఆఫీసులో అందరిలో పాటు కూర్చొని చర్చ చేసుకోవటం లేదంటే వాణిజ్య సముదాయాల్లో ఒక చోట చేరి చర్చ చేసుకోవటం ఉంటుంది.

ఓట్ల లెక్కింపు ఆదివారం జరుగుతుండటం.. ఇలా ఒక చోట చేరి మాట్లాడుకునే అవకాశం మిస్ అవుతుంది. ఎవరికి వారు వారి ఇళ్లల్లో కూర్చొని టీవీలు చూస్తూ.. మొబైల్ ఫోన్లలో చర్చించుకోవటమే ఉంటుందని చెప్పాలి. మొత్తంగా చూస్తే.. గడిచిన కొన్నాళ్లుగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ ఒక కొలిక్కి రావటమే కాదు.. ఎన్నికల ప్రక్రియలో చివరిదైన పోలింగ్.. ఓట్లు లెక్కింపు ఈ వారంలోనే జరగనున్నాయి. దీంతో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ ఫీవర్ తీవ్రంగా ఉండటం ఖాయమని చెప్పాలి. వణికే చలికి సైతం రాజకీయ వేడి చురుకు పుట్టేలా చేస్తుందని చెప్పక తప్పదు.

Tags:    

Similar News