కరీనా కపూర్ పై తప్పుడు ప్రచారం... 'ఖిలాడీ' భార్య సీరియస్!

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి కేసు తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

Update: 2025-01-26 14:40 GMT

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి కేసు తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పోలీసులకు సైఫ్, కరీనా ఇచ్చిన వాంగ్మూలాలు సరిపోలడం లేదనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ సమయంలో.. మరింత ముందుకెళ్లి కరోనాపై తప్పుడు ప్రచారం చేస్తూ పలు కథనాలు తెరపైకి వచ్చాయి. ఈ సమయంలో ట్వింకిల్ ఖన్నా స్పందించారు.

అవును... సైఫ్ అలీఖాన్ ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఆయన సతీమణి కరీనా కపూర్ గురించి ఎన్నో వదంతులు వ్యాప్తి చేందాయని.. ఇదే సమయంలో క్రికెటర్ విరాట్ కొహ్లీ సరిగ్గా ఆడకపోతే అందుకు అనుష్క శర్మను నిందిస్తూ ప్రచారం చేస్తున్నారని చెబుతూ... బాలీవుడ్ నటుడు, 'ఖిలాడి' అక్షయ్ కుమార్ సతీమణి, రచయిత ట్వింకిల్ ఖన్నా స్పందించారు.

ఏదైనా విషయంలో ఓ పురుషుడు ఫెయిల్ అయితే.. ఆ కారణంగా అతని భాగస్వామిని నిందించడాన్ని ఉద్దేశించి ట్వింకిల్ ఖన్నా ఓ ఆంగ్ల పత్రికకు రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల తన నివాసంలో దుండగుడి దాడిలో గాయపడిన సైఫ్ అలీఖాన్ - కరీనా దంపతులతో పాటు టీమిండియా క్రికెటర్ విరాట్ - అనుష్కలను ప్రస్థావించారు.

ఈ సందర్భంగా... సైఫ్ ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఆయన సతీమణి గురించి ఎన్నో వదంతులు వ్యాప్తి చెందాయని.. ఇందులో భాగంగా.. ఆయనపై దాడి జరిగిన సమయంలో ఆమె ఇంట్లో లేదని కొంతమంది, గాయాలతో ఇబ్బంది పడుతున్నా ఆయనకు ఏమాత్రం ఆమె సాయం చేయలేదని ఇంకొందమంది మాట్లాడుకున్నరాని ట్వింకిల్ ఖన్నా అన్నారు.

అసలు.. ఈ వదంతులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోయినా అవి మాత్రం ఆగడం లేదని అన్నారు. ఇక.. క్రికెటర్ విరాట్ కొహ్లీ సరిగ్గా ఆడనప్పుడల్లా కొంతమంది ఆయన సతీమణి అనుష్క శర్మను నిందిస్తుంటారని.. మహిళ,అందులోనూ ఒకరి భార్యపై నిందలు రావడాన్ని ప్రతిఒక్కరూ ఎంజాయ్ చేశారని ఆమె రాసుకొచ్చారు.

మరోపక్క.. సైఫ్ పై జరిగిన దాడి కేసులో తాజాగా ఓ కీలక పరిణామం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... దాడి జరిగిన ప్రదేశంలో సేకరించిన 19 వేలిముద్రల్లో ఏవీ నిందితుడి వేలి ముద్రలతో మ్యాచ్ కావడం లేదని పోలీసులకు ఫోరెన్సిక్ టీమ్ వెల్లడించినట్లు కథనాలొస్తున్నాయి. దీంతో.. మరోసారి వేలి ముద్రల సేకరణ చేయనున్నారని అంటున్నారు.

Tags:    

Similar News