దుబాయ్ ఎడారిలో 'ఒంటె' ఉబర్ రైడర్.. వీడియో వైరల్!
అవును... తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియో వైరల్ గా మారుతోంది.
సిటీలో ఉబర్ యాప్ ఓపెన్ చేసి రైడ్ బుక్ చేసుకోవడం సహజమైన విషయమే! ఆ సమయంలో కారు, బైకు, ఆటో వంటి ద్విచక్ర, త్రిచక్ర, చతుశ్చక్ర వాహనాలు వస్తుంటాయి. అయితే తాజాగా ఉబర్ క్యాబ్ ద్వారా ఎడారి ఓడ (ఒంటె) వచ్చి ప్రయాణికురాలిని తీసుకుని వెళ్లిన ఘటన దుబాయ్ లో చోటు చేసుకుంది.
అవును... తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియో వైరల్ గా మారుతోంది. ఈ వీడియో దుబాయ్ లోని ఎడారిలో ఇరుక్కుపోయిన ఇద్దరు మహిళలకు సంబంధించినదిగా ఉంది. వారు ఎడారిలో వారి వాహనం చేడిపోవడం వల్ల ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో వారు ఉబర్ ని ఆశ్రయించారు!
దీంతో... ఊహించని విధంగా ఒక వ్యక్తి ఒంటెను వెంటపెట్టుకుని వారి వద్దకు వచ్చి.. తనను తాను ఉబర్ (ఒంటె) డ్రైవర్ గా పరిచయం చేసుకున్నాడు. దీంతో.. ఆశ్చర్యపోవడం ఆ అమ్మాయిల వంతయ్యింది! వారిలో ఒకరు ఆ అసాధారణమైన రైడ్ ని చూసి పులకించిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట ఇప్పుడు వైరల్ గా మారింది.
ఈ సమయంలో క్యాబ్ బుక్ చేసిన మహిళ.. ఒంటెను తీసుకుని వచ్చిన వ్యక్తితో చిన్నపాటి చిట్ చాట్ చేశారు. ఇందులో భాగంగా తన జీవనోపాధి గురించి అడిగారు. దీనికి స్పందించిన అతడు... తాను ఉబర్ ఒంటెను నడుపుతునానని, ఎడారిలో దారితప్పిన వ్యక్తులకు సహాయం చేస్తానని.. అందులో ఓ ప్రత్యేకత ఉందని చెప్పుకొచ్చాడు!
ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. మరోపక్క ఈ వీడియో పక్కన కామెంట్ సెక్షన్ లో నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా.. ఇదంతా ఫేక్ అని, వ్యూస్ కోసం చేసిన ట్రిక్ అని ఒకరంటే... దుబాయ్ లో ఒంటెను వాహనంగా ఆర్డర్ చేయడం పెద్ద విషయం కాదని మరొకరు అంటున్నారు.
ఇదే సమయంలో... భద్రతా కారణాల దృష్ట్యా నెంబర్ ప్లేట్ ని తనిఖీ చేయాలంటూ మరొకరు స్పందించారు. అయితే ఆ వీడియోలో ఎడారికి సమీపంలో ఓ రోడ్ కనిపిస్తుండటం గమనార్హం!!