ఎంపీగా టైం : నాడు భరత్ నేడు ఉదయ్...!
ఒకపుడు ఎంపీ అంటే బిజినెస్ టైకూన్లకు పార్టీకి భారీ ఎత్తున విరాళాలు ఇచ్చేవారికి చాన్స్ ఉండేది.
రాజకీయాల్లో రాణించాలంటే సుడి ఉండాలి. అది లేకపోతే ఎంత ప్రయత్నం చేసినా అసలు కుదరదు. ఇదిలా ఉంటే కాకినాడ నుంచి జనసేన ఎంపీ అభ్యర్ధిగా టీ టైం ఉదయ్ శ్రీనివాస్ ని పవన్ ప్రకటించడంతో అదే నిజం అని అంతా నమ్ముతున్నారు. ఒకపుడు ఎంపీ అంటే బిజినెస్ టైకూన్లకు పార్టీకి భారీ ఎత్తున విరాళాలు ఇచ్చేవారికి చాన్స్ ఉండేది.
వారు కూడా కొన్ని దశాబ్దాల అనుభవం గడించిన వారు అయి ఉండేవారు. వయసు కాస్తా మీరిన వారు కూడా ఉండేవారు. కానీ ఇపుడు మాత్రం అలా కాదు చిన్న వయసులోనే పెద్ద చాన్స్ వస్తోంది. ఎంపీగా అతి చిన్న వయసులో ఆఫర్ కొట్టేశారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్.
ఆయనకు అనూహ్యంగా టికెట్ దక్కింది. జగన్ వేవ్ లో ఆయన గెలిచి అయిదేళ్ల ఎంపీ అయిపోయారు. ఇపుడు భరత్ అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. నాడు భరత్ కి జాక్ పాట్ తగిలింది అని అంతా అనుకున్నారు. ఇపుడు చూస్తే కాకినాడ ఎంపీ అభ్యర్ధిగా ఉదయ్ శ్రీనివాస్ పేరు ప్రకటించడంతో ఆయనకు కూడా లక్ ఫేవర్ అయి అంటున్నారు. ఎంపీ అంటే మాటలు కాదు పెద్ద పెద్ద ఇండస్త్రీలిస్ట్లు లాంటి వాళ్ళకే కానీ పని..వందల కోట్లు ఖర్చుతో కూడుకున్న పని..సామాన్యులైన భరత్ , ఉదయ్ లాంటి వారికీ దక్కడం అంటే చాల అదృష్టం అనే చెప్పాలి.
ఇదిలా ఉంటే ఇప్పటికి ఏడు ఎనిమిదేళ్ళ క్రితం వరకూ సామాన్యుడిగా ఉన్న ఉదయ్ బిజినెస్ ఫీల్డ్ లోకి వెళ్లి కొంత వరకు రాణించారు. ఆ మీదట ఆయన పొలిటికల్ లక్ ని చూడాలనుకున్నారు. జనసేన వైపు ఆయన చూశారు. పవన్ జట్టుతో కలిశారు. టీ టైం అంటూ పవన్ టీం తో ఒక్కరిగా అయిపోయారు.
చిత్రమేంటి అంటే పవన్ పార్టీ గుర్తు గాజు గ్లాస్. మరి టీ టైం ఉదయ్ జనసేనతో కలవడం అంటే భలేగా కుదిరింది అని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ ఊపులో ఈ పొత్తులలో గెలుస్తారు అని అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి చూస్తే పవన్ తూర్పు వైపు చూపు సారించారు. ఒకే దెబ్బకు అటు ఎంపీ ఇటు ఎమ్మెల్యే గెలుచుకోవాలని అనుకుంటున్నారు. గతసారి చేసిన తప్పులను చేయకుండా పొత్తులతో వ్యూహాలతో వస్తున్నారు. ఒక వైపు సెంటిమెంట్ సానుభూతిని కూడా జనసేన పెంచుతూ పోతోంది. మరో వైపు అస్త్రశస్త్రాలతో సిద్ధం అవుతోంది. ఏది ఏమైనా ఈసారి తూర్పులో పొలిటికల్ ఫైట్ వేరే లెవెల్ అని అంటున్నారు.