రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించే అరెస్ట్ ఒకటి ఉందిట...?

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అవడం రిమాండ్ కి వెళ్లడం వంటి పరిణామాల నేపధ్యంలో ఉండవల్లి తాజా రాజకీయపరిస్థితుల మీద తనదైన శైలిలో విశ్లేషించారు.

Update: 2023-09-12 17:46 GMT

తెలుగు రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసి తీవ్ర ప్రకంపనలు పుట్టించే అరెస్ట్ ఒకటి మరో నెలన్నర రోజులలో జరగనుందా. ఈ ప్రశ్నకు ఉంది అని బల్ల గుద్దుతున్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అవడం రిమాండ్ కి వెళ్లడం వంటి పరిణామాల నేపధ్యంలో ఉండవల్లి తాజా రాజకీయపరిస్థితుల మీద తనదైన శైలిలో విశ్లేషించారు.

చంద్రబాబు అరెస్ట్ ప్రభావం అయితే ఏపీ రాజకీయాల్లో మిశ్రమంగానే ఉంది. టీడీపీ ఆశించిన సానుభూతి అయితే ఈ రోజుకీ పోగు కాలేదు. ఏదో జరుగుతుందని అనుకుంటే చాలా సాఫీగా ప్రశాంతంగా ఏపీ ముందుకు సాగిపోతోంది. అయితే ఉండవల్లి మాత్రం చంద్రబాబు అరెస్ట్ తో పోల్చుతూ అసలు అరెస్ట్ ముందు ఉంది అని అంటున్నారు.

ఆ అరెస్ట్ కనుక జరిగితే అది ఆషామాషీగా ఉండదని దాని తీవ్రత జాతీయ స్థాయిలో భారీ ప్రకంపనలకు కారణం అవుతుంది అని అంటున్నారు. అయితే అంతటి పెద్ద అరెస్ట్ ఎవరిది. ఆ పెద్ద మనిషి ఎవరు అన్నది మాత్రం చెప్పడంలేదు.

ఇక గడచిన పదిహేనేళ్ళుగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మార్గదర్శి అవకతవకల మీద పోరాడుతున్నారు. 2008 నుంచే ఆయన ఈ పోరాటం స్టార్ట్ చేశారు. ఉమ్మడి ఏపీ హై కోర్టులో ఆ కేసు 2018 డిసెంబర్ లో కొట్టేస్తే దాని మీద సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ ఆయన పోరాడుతున్నారు. ఇటీవల కాలంలో ఏపీ ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ అయింది.

ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది. మరి ఉండవల్లి చెబుతున్నది మార్గదర్శి కేసు విషయమా అన్నది కూడా డౌట్ గా ఉందని అంటున్నారు. మార్గదర్శి అధినేత రామోజీరావు అరెస్ట్ అయితే మాత్రం దాని తీవ్రత ప్రకంపనలు వేరే రేంజిలో ఉంటాయనే అంతా ఊహిస్తున్నారు. ఆయన మీడియా మొఘల్ గా ఉన్నారు. జాతీయ స్థాయిలో ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించిన వారు.

ఆర్ధిక నేరాలకు సంబంధించిన కేసుగా దీన్ని చెబుతూ ఉంటారు. మరి ఈ కేసులో ఏపీ ప్రభుత్వం ఏపీ సీఐడీ ద్వారా విచారణను మరో వైపు జరిపిస్తోంది. బహుశా ఈ కేసుని దృష్టిలో పెట్టుకుని ఉండవల్లి ఈ హాట్ కామెంట్స్ చేశారా అన్న చర్చ అయితే నడుస్తోంది. అదే టైం లో స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ స్కాం కి సంబంధించి నారా లోకేష్ పేరు ఉందని అంటున్నారు.

ఆయన అరెస్ట్ ని ఊహిస్తూ ఉండవల్లి ఈ కామెంట్స్ చేశారా అన్న డౌట్లు వస్తున్నాయి. అయితే నారా లోకేష్ ని అరెస్ట్ చేస్తే తీవ్ర స్థాయిలో ప్రకంపనలు రాజకీయంగా వచ్చే అవకాశాలు ఎంతవరకూ ఉంటాయన్నది కూడా చూడాలి. చంద్రబాబు అరెస్ట్ అయితేనే అనుకున్న స్థాయిలో రియాక్షన్ రాలేదు అని అంటున్నారు. సో ఉండవల్లి ఎవరిని ఉద్దేశించి అరెస్ట్ జరుగుతుంది అన్నారో దానికి డెడ్ లైన్ ఎందుకు పెట్టారో అక్టోబర్ 30కి ఉన్న ప్రాధాన్యత ఏంటో కూడా రానున్న రోజులలోనే తెలుస్తుంది అంటున్నారు.

Tags:    

Similar News