వాలంటీర్ల వ్యవస్ధ రద్దా ?
కోర్టులో కేసువేస్తే వాలంటీర్ల వ్యవస్ధ రద్దయిపోవటం ఖాయమ ని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు.
ఎవరైనా కోర్టులో కేసువేస్తే వాలంటీర్ల వ్యవస్ధ రద్దయిపోవటం ఖాయమ ని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. వాలంటీర్ల వ్యవస్ధను రద్దుచేయించటానికి టీడీపీ, జనసేన పార్టీలు ఎందుకు కోర్టును ఆశ్రయించటంలేదో అర్ధంకావటంలేదన్నారు. పై రెండు పార్టీల్లో ఏ ఒక్కటి కోర్టులో కేసువేసినా చాలన్నారు.
వాలంటీర్ల వ్యవస్ధను రద్దు చేయించేందుకు తెలుగుదేశంపార్టీ, జనసేన అధినేతల ను ఎందుకు భయపడుతున్నారంటు నిలదీశారు. నిజానికి వాలంటీర్ల వ్యవస్ధకు వ్యతిరేకంగా మాట్లాడితే ఎక్కడ సమస్యలు వస్తాయో అన్న ఆలోచనతోనే చంద్రబాబునాయుడు ఏమీ మాట్లాడటంలేదు.
హ్యూమన్ ట్రాఫికింగుకు వాలంటీర్లే కారణమని పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణల పై ఎంత గోలైందో అందరు చూసిందే. నిజానికి పవన్ చేసింది నిరాధార ఆరోపణల ని అందరికీ తెలుసు. చేతిలో ఎలాంటి ఆధారాల ను పెట్టుకోకుండా పవన్ ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేశారో అర్ధంకావటంలేదు.
మహిళల మిస్సింగ్ వేరు హ్యూమన్ ట్రాఫికింగ్ వేరన్న చిన్న లాజిక్ ను పవన్ మిస్సయ్యారు. కేంద్ర హోంశాఖ ఇచ్చిన నివేదిక లో కూడా మహిళలు, బాలికలు మిస్సవుతున్నట్లు చెప్పిందే కానీ ఎక్కడా హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతోందనలేదు.
ప్రస్తుతం వాలంటీర్ల వ్యవస్ధన్నది జనాల్లో బాగా పాతుకుపోయింది. అక్కడక్కడ ఎవరిమీదైనా నెగిటివ్ ఉన్నా హోలు మొత్తంమీద జనాల్లో పాజిటివ్ దృక్పధమే ఉంది. ఇలాంటి వ్యవస్ధను రద్దుచేయించేందుకు ఎవరైనా కోర్టులో కేసు వేస్తే అది కచ్చితంగా వ్యతిరేక ఫలితాలనే ఇస్తుంది. ఈ విషయం తెలిసే చంద్రబాబు, పవన్ కల్యాణ్ వ్యవసస్ధ రద్దుకు కోర్టులో కేసు వేయలేదు.
ఉండవల్లి మీడియా సమావేశాల్లో వంద చెబుతారు. ఎందుకంటే ఆయనకు పోయేదేమీలేదు. రెండున్నల లక్షలమంది వాలంటీర్లు, 1.5 లక్షల మంది గ్రామ, వార్డు సచివాయాల సిబ్బంది వ్యతిరేకమైతే నష్టం తెలుగుదేశం, జనసేనకే కానీ ఉండవల్లికి ఏమీకాదు. అందుకనే చంద్రబాబు జాగ్రత్తగా మాట్లాడుతున్నది. పైగా తాము అధికారం లోకి వస్తే వాలంటీర్ వ్యవస్ధను రద్దుచేయమని మరింతగా బలోపేతం చేస్తామని హామీకూడా ఇచ్చారు. కాబట్టి టీడీపీ, జనసేనలకు ఉండవల్లి ఉచిత సలహాలు ఇవ్వకుండా ప్రాక్టికల్ గా జరగాల్సింది చెబితే బాగుంటుంది. అంతేకానీ ప్రతిపక్షాలను ఇబ్బందుల్లోకి నెట్టే సలహాలెందుకు ?